హిందీ సీరియల్స్ లో నటించి సుదీర్ఘ కాలం పాటు అక్కడి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న మృణాల్ ఠాకూర్ ఇటీవలే హను రాఘవపూడి దర్శకత్వం లో వచ్చిన సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఆ సినిమా లో దుల్కర్ సల్మాన్ కి జోడి గా ఈ ముద్దుగుమ్మ నటించి ఆకట్టుకుంది.
తెలుగు లో టాప్ హీరోయిన్ అయ్యే టాలెంట్ మరియు అందం ఉన్న ఈ అమ్మడు చాలా మంది ప్రేక్షకులకు నచ్చేసింది.కాస్త ఆలస్యం గా నాని తో ఇటీవలే ఒక తెలుగు సినిమా కు కమిట్ అయింది.
ఆ మధ్య ఒక మెగా హీరో సినిమా ఆఫర్ వస్తే కథ నచ్చలేదు అంటూ తిరస్కరించిందని ప్రచారం జరిగింది.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మృనాల్ ఠాకూర్ స్పందిస్తూ తాను మెగా హీరో తో సినిమా ఛాన్స్ వస్తే కథ విషయం లో నో చెప్పాను అంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం నిజం కాదని క్లారిటీ ఇచ్చింది.
తనకు అసలు ఏ మెగా హీరో సినిమా లో నటించేందుకు అవకాశం రాలేదని.
పెద్ద హీరో లతో నటించే సమయం లో కాస్త కథ విషయం లో చూసి చూడకుండా వ్యవహరించేందుకు తాను రెడీ అన్నట్లుగా మృణాల్ పేర్కొంది.భారీ అంచనాల నడుమ నాని తో నటించబోతున్న సినిమా రూపొందుతున్నట్లుగా కూడా ఆమె పేర్కొంది.ముందు ముందు తెలుగు లో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయాలని ఉద్దేశం తో తాను ఉన్నానని.
అదే సమయం లో ఇతర భాషల్లో కూడా సినిమా లు చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొంది.తెలుగు లో ఈ అమ్మడు నటించిన ఒకే ఒక సినిమా సీతారామం సూపర్ హిట్ అవడం తో ఒకే సారి నాలుగైదు ఆఫర్స్ ఈ అమ్మడి తలుపు తడతాయని అంతా భావించారు.కానీ ఇప్పటి వరకు నాని సినిమా ను మాత్రమే కమిట్ అయింది.
ఈ ఏడాది మరో రెండు మూడు సినిమాల్లో ఈ అమ్మడం నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy