టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది.మాస్ కాపీయింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు.

ఇందులో భాగంగా మహ్మద్ ఖాలిద్ ను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.మూడు రోజుల కస్టడీలో భాగంగా నిన్న ఖాలీద్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ రెండో రోజు విచారించనున్నారు.

కాగా హైటెక్ మాస్ కాపీయింగ్ లో పూల రమేశ్ కు ఖాలిద్ సహకరించినట్లు గుర్తించారు.ఖాలిద్ గది నుంచి అభ్యర్థులకు రమేశ్ సమాధానాలు చేరవేశాడని నిర్ధారించారు.

కాగా చాట్ జీపీటీ సాయంతో సమాధానాలను ఖాలిద్, రమేశ్ గుర్తించారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పూల రమేశ్, ఖాలిదద్ మధ్య పరిచయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Advertisement

మరోవైపు పరారీలో ఉన్న కాలేజీ ప్రిన్సిపల్ గురించి గాలిస్తున్నారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు