Allu Arjun : బన్నీ స్టైల్ వెనుక శిరీష్ హస్తం….పాపం శిరీష్!!

అల్లు అర్జున్( Allu Arjun ) స్టైల్ కి చిరునామా.

ఆయన తీసే ప్రతి సినిమా తోను ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తాడు.

ఆన్ స్క్రీన్ ఏ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా బన్నీ వస్త్ర ధారణ ఎప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తూ ఉంటుంది.ఆయన పబ్లిక్ ఫంక్షన్స్ కి ధరించిన దుస్తులను వెంటనే గూగుల్ చేసి వాటి వివరాలను సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

అల్లు అర్జున్ అప్పట్లో విజయ్ దేవరకొండ టాక్సీ వాలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ధరించిన గివేంచే స్వెట్ షర్ట్ ఎంత వైరల్ అయ్యిందో మనందరికీ తెలుసు.ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్( Allu Sirish ) ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

నిజానికి అల్లు అర్జున్ ధరించే దుస్తులు అతనివి కాదట.అతని తమ్ముడు శిరీష్ వట.శిరీష్ ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి తనకు నచ్చిన దుస్తులను ఎంతో ఇష్టంగా కొనుక్కొని ఏదయినా స్పెషల్ అకేషన్ కోసం దాచుకుంటాడట.కానీ బన్నీ ఆ దుస్తులను అతన్ని అడగకుండా వేసుకొని పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్ళిపోతాడట.

Advertisement

నా బట్టలు ఏమయ్యాయి అని శిరీష్ అడిగితే బన్నీ వేసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తారట.ఆ తరువాత ఆ వస్త్రాలను శిరీష్ వేసుకొని ఎక్కడైనా కనిపిస్తే బన్నీ బట్టలు వాడేస్తున్నాడు అని అందరు హేళన చేస్తారని తన బాధను చెప్పుకొచ్చాడు శిరీష్.

శిరీష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ తమ్ముడిగా అల్లు అరవింద్ ( Allu Arvind )కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు అల్లు శిరీష్.శిరీష్ మొదటి చిత్రం గౌరవం( Gouravam )మంచి ప్రశంసలు అందుకుంది.ఆ తరువాత శిరీష్ నటించిన చిత్రాలు కొత్త జంట, ఒక్క క్షణం, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలు అముఞ్చి విజయాన్ని సాధించాయి.

శిరీష్ చివరిగా నటించిన చిత్రం ఉర్వశివో రాక్షసివో.ఈ చిత్రం 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు