వివాదంలో చిక్కుకున్న సరిగమప సింగర్ యశస్వి.. అసలేం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు యంగ్ సింగర్ యశస్వి కొండెపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జాను సినిమాలోని పాటతో ఒక్కసారిగా విపరీతంగా పాపులారిటిని సంపాదించుకున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం యశస్వి కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే యశస్వి తనది కాని స్వచ్ఛంద సంస్థను తనదిగా చెప్పుకుని తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నాడు అంటూ నవసేవ ఫౌండేషన్ నిర్వాహకురాలు ఫరా కౌసర్ ఆరోపించింది.

నవసేవ అనే పేరుతో తాను ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నానని ఓ ఎన్జీవో ద్వారా సుమారు 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నాను అంటూ యశస్వి తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నాడు అని ఆమె తెలిపింది.

కానీ ఆ సంస్థను తానే నడుపుతున్నానని 58 మంది అనాధ పిల్లలను చదివిస్తున్నానని పరా కౌసర్ వెల్లడించింది.ఈ నేపథ్యంలోనే యశస్వి పై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించడంతో ఆమె వ్యాఖ్యలపై తాజాగా యశస్వి స్పందించాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యశస్వి ఆ విషయాలపై స్పందిస్తూ.

Advertisement

సరిగమప ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీరు చేసిన సహాయాలకు సంబంధించిన వీడియో బైట్స్ ఏవైనా ఉంటే ఇవ్వండి అని అన్నారు.నేను కొన్ని ట్రస్టులకు సహాయం చేశాను.

యాక్సిడెంట్ అయిన వాళ్లకు కూడా సహాయం చేశాను.నా ఫ్యాన్ పేజ్ అబ్బాయికి ఏవైనా వీడియో బైట్స్ ఉంటే తీసుకో అని చెప్పాను.

సాధ్య ఫౌండేషన్ నేను చాలా సార్లు సహాయం చేశాను.

ఈ సాధ్య ఫౌండేషన్ వాళ్లు నవసేన లాంటి చాలా అనాధ ఆశ్రమాలకు స్నాక్స్ ఫుడ్ పంపిస్తూ ఉంటారు.నేను సాధ్య ఫౌండేషన్ ద్వారా ఇన్ డైరెక్ట్ గా వాళ్లకు సహాయం చేశాను.డైరెక్ట్ గా అయితే నవసేన వాళ్లకు సహాయం చేయలేదు.

ఛీ.. థూ, ఇజ్రాయెల్ వ్యక్తిపై ఉమ్మి వేసిన ఐరిష్ మహిళ.. రెస్టారెంట్‌లో దారుణం..
మంచు మనోజ్ విలన్ గా రాణిస్తాడా..? ఆయన కోసం కొన్ని క్యారెక్టర్స్ ను క్రియేట్ చేస్తున్నారా..?

అసలు నాకు నవసేవ తెలియదు.నేను ఎప్పుడు వెళ్లలేదు.

Advertisement

మా వాళ్లు ప్రోమోలో వీడియో బయట కావాలండి యశస్వి అన్నకు ఆల్ ది బెస్ట్ చెబుదాము.అని నవసేనకు వెళ్లి ఒక వీడియో బయట తీసుకోవచ్చా అని అడిగినప్పుడు ఫరా కౌసర్ ని అడగగా ఆమె ఓకే చెప్పిందట.

వీడియో కోసం వెళ్తే ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పింది.ఆ తర్వాత మా కెమెరామెన్ బయటకు వచ్చి ఆ బోర్డు వీడియో కూడా తీసి వాటన్నింటినీ టీవీ వాళ్లకు పంపాడు.

ఆ వీడియోలో నేను చేసిన సేవ కార్యక్రమాలతో పాటుగా యువసేన బోర్డు కూడా పెట్టారు ఆ విషయం నాకు తెలియదు.ఆ తర్వాత కొంతమంది నాకు చెప్పారు.

ఆ సమయంలో నేను ఫరా కౌసర్ కి ఫోన్ చేసినప్పుడు ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేము తర్వాత ప్రోమో కూడా డిలీట్ చేయించాము.అయితే అదంతా చూసి నేను నవసేనకు ఇండైరెక్ట్ గా సహాయం చేస్తున్నాను అని అన్నారు అంటూ ఆ వివాదం పై వివరణ ఇచ్చాడు యశస్వి.

తాజా వార్తలు