పక్కవారి జీవితంపై బురదజల్లే ముందు నీ జీవితం ఎలా ఉందో చూసుకో !

సింగర్ సుచిత్ర( Singer suchitra ) మొదటి నుంచి ఈ సుచి లిక్స్ పేరిట ఆమె చాలా పాపులర్ అయింది.

ఆమెకు ఎవరితో విభేదాలు వచ్చాయో ఏమో కానీ ఆమె లీక్స్ కొంత కాలం క్రితం ట్విట్టర్ ద్వారా మొదలయ్యాయి.

అనేకమంది నటినటుల వీడియోలు ఫోటోగ్రాఫ్ రొమాంటిక్ చాట్స్ ని ఆమె బయట పెట్టింది.ఆమె అలా చేయడం ద్వారా దొరికిన సంతోషం ఏంటి అంటే శూన్యం.

ఎంతో టాలెంట్ ఉన్న సుచిత్ర ప్రస్తుతం భర్తతో విడిపోయి సోషల్ మీడియా( Social media )కు కూడా దూరంగా ఉంటూ కెరియర్ ను కొనసాగించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంది.సుచిత్ర సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా రచయితగా, గీత రచయితగా, నటిగా ఇలా ఎన్నో టాలెంట్ కలిగి ఉన్న అద్భుతమైన పర్ఫార్మర్.

Singer Suchithra Divorce Issue , Singer Suchitra, Husband, Dhanush, Aishwar

బిగ్ బాస్ హౌస్ కి కూడా వెళ్లి వచ్చింది.ఇన్ని ఉన్నా కూడా ఆమె నోరు మంచిది కాదు ఎందుకంటే ఎవరి గురించైనా ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టేస్తుంటుంది.పక్క ధనుష్ ఐశ్వర్య విడిపోయారు కానీ ఇందులో సుచిత్రకొచ్చిన నష్టం ఏంటి ఆమె మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకరి పర్సనల్ లైఫ్ గురించి మీడియాలో నోరు పారేసుకోవడం వల్ల వచ్చిన లాభమేంటి ? రజనీకాంత్( Rajinikanth ) లాంటి ఒక పెద్ద స్టార్ కూతురు మంచిది కాదు, బాడ్ మదర్ అంటూ చెప్పాల్సిన అవసరం ఏముంది.ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయంటూ మాట్లాడాల్సిన అవసరం సుచిత్రకు ఎందుకు వచ్చింది.

Advertisement
Singer Suchithra Divorce Issue , Singer Suchitra, Husband, Dhanush, Aishwar

ఈమె ఇలా మాట్లాడడం అయితే కొత్త కాదు.గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది గురించి చాలా బాహ్యంగా చెబుతూ వస్తుంది.

Singer Suchithra Divorce Issue , Singer Suchitra, Husband, Dhanush, Aishwar

మనకు న్యాయం జరగాలి అని కొట్లాటడం ఒక విషయం కానీ పక్క వాళ్ళ జీవితాలు నాశనమైనా పర్వాలేదు అంటూ నోరు తెరవడం మాత్రం మంచి విషయం కాదు.ఇలా గతంలో చాలామంది వీడియో ముందు మైక్ పెట్టగానే నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతూ వచ్చారు.అసలు ఇంత మాట్లాడిన సుచిత్రకు తన భర్తతో ఎందుకు విడాకులు జరిగాయి చెప్పండి.2005లో పెళ్లి చేసుకున్నారు.2017 వరకు కలిసి కాపురం చేసి అప్పుడు విడాకులు తీసుకున్నారు సుచిత్రతో తాను జీవించలేను అంటూ కార్తీక్ విడిపోయాడు.ఇలా పక్క వాళ్ళ జీవితాలపై పని ఏడ్చే ముందు నీ జీవితం ఎలా ఉందో చూసుకుంటే మంచిది సుచిత్ర అంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు