Singer Jikki: పాటల పందిరి లో పూచిన పూదోట జిక్కి.. సంగీతమే రాని విద్వాంసురాలు

ఎవరైనా ఒక పాట పాడాలంటే సంగీతం మీద పట్టు ఉండాలి.గమకాల పైన అవగాహనా ఉండాలి.

ఎక్కడ ఏ రాగం ఎలా పలకాలో తెలియకపోతే అది పాట కాదు పచ్చడి అవుతుంది.మరి వీటికి పూర్తిగా విరుద్ధం పిల్లపాలు గజపతి కృష్ణవేణి.

ఈ పేరు చెప్తే ఎవరికి గుర్తు రాదు కానీ జిక్కి అంటే మాత్రం టక్కున గుర్తు పడతారు.ఈ తరం వారికి బాగా గుర్తచ్చే పాట మహేష్ బాబు మురారి సినిమాలోని అలనాటి రామ చంద్రుడి కన్నింటా సాటి.

జీవితంలో ఒక్క రోజు కూడా సంగీతం నేర్చుకొని జిక్కి గాత్రం నుంచి పాటల మధురిమలు తొణికిసలాడేవి.దేనికి పులకించని వారిని కూడా తన గాన మాధుర్యంతో పులకించగల గాత్రం జిక్కి సొంతం.

Advertisement

జిక్కి తండ్రి మద్రాసులో బ్రతకడానికి చిన్న చిన్న వేషాలు వేసేవారు.తండ్రితో పాటు అన్ని స్టూడియోలు తిరుగుతున్న జిక్కి ని చూసి ఒక రోజు పంతులమ్మ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకున్నారు గూడవల్లి రామబ్రహ్మం.

ఆ తర్వాత గొల్లబామ, త్యాగయ్య, మంగళసూత్రం వంటి సినిమాల్లో నటించింది.అదే సమయంలో జిక్కి సంగీత దర్శకుడు అయినా ఆదినారాయణ రావు కంట్లో పడింది.

అస్సలు సంగీత జ్ఞానం లేకుండా గమకాలు తెలియకుండా, చక్కగా ఎక్సప్రెషన్ తో పాడుతున్న జిక్కీని చూసి అయన ఆశ్చర్యపోయారు.ఆమె చివరగా జ్ఞాన సుందరి సినిమాలో నటించి గాయని గా సెటిల్ అయ్యారు.

ఆమె పాడిన పాటల్లో హాయి హాయి గా ఆమని సాగే, జాణవులే నెరజాణవులే పాటలు ఎన్ని సార్లు విన్న తనవి తీరదు.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

ఇక ఆమె కో సింగర్ ఏం ఏం రాజా తో పాటలు పాడుతూనే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.ఇద్దరు కలిసి చాల పాటలు పాడారు.బాషా తో సంబంధం లేకుండా నార్త్ టూ సౌత్ అన్ని భాషల్లో పాటల ప్రయాణం చేసారు.

Advertisement

ఇక తెలుగు నుంచి హిందీ కి వెళ్లి పాటలు పాడిన తొలి జంట వీరిదే.ఇద్దరు కొడుకులు పుట్టాక రైలు ప్రమాదం లో రాజా చనిపోతే పిల్లలలో దేశ విదేశాల్లో కచేరీలు చేసింది.

ఎవరు ఎంత ఇచ్చిన కాదనకుండ పాట పాడేది.ఎంత ఇస్తారు అని ఏనాడూ అడగలేదు.

ఎవరితోనూ విభేదాలు తెచ్చుకోలేదు.చివరి శ్వాస వరకు పాడుతూనే ఉంది.2004 లో ఆమె శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.

తాజా వార్తలు