తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో ఆడవారి పై జరిగే ఆఘయిత్యాల, అత్యాచారాల గురించి తనదైన శైలి లో స్పందిస్తూ ఉంటుంది.
మీటు ఉద్యమం ద్వారా ఇండస్ట్రీలో ఎదురైన సంఘటనల గురించి ధైర్యంగా నోరు విప్పింది.అంతేకాకుండా ఇప్పటికీ సమాజంలో లింగ వివక్షత పై కూడా స్పందిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.ఆమె సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి సూటిగా మాట్లాడారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానుల వల్ల ట్రోలింగ్‌కి గురైన హీరోయిన్ మీరా చోప్రా గురించి ఆమె మాట్లాడారు.మీరాకు తాను సపోర్ట్ అందించినట్లు ఆమె తెలిపింది.
నాకు ఎదురైన సమస్యలపై నేను ఎదురు తిరిగినప్పుడు చాలా విమర్శలను ఎదుర్కొన్నాను.ఆకారంలోని ఎంతోమంది బూతులు తిట్టారు.
నేను వాళ్ళ రియాక్షన్ చూసి పెద్దగా రియాక్ట్ కాలేదు.ఇంకేంటి అది వాళ్ళ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది అని అది వాళ్ళకి వదిలేశాను.
ఇకపోతే మనం ఎవరో తెలియని వ్యక్తి ని తిట్టడం కామెంట్లతో విరుచుకు పడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు అర్థం కావడం లేదు.కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో ఫాన్స్ మధ్య జరిగే ఫాన్స్ వార్ చూస్తుంటే ఒక్కోసారి షాకింగ్ గా కూడా ఉంటుంది.
మీరు ఇవన్నీ చేస్తున్నారని మీ తల్లిదండ్రులకు తెలుసా! అనే అనుమానం కూడా వస్తుంటుంది.
అయితే మగవారు ఎలాంటి కంటెంట్‌ను సోషల్ మీడియాలో ఉపయోగిస్తున్నారన్న సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియక పోవచ్చు.స్టార్ వార్‌లో వారు ఆడవాళ్లని ఎందుకు టార్గెట్ చేస్తారో నాకు అర్థం కావడం లేదు.మీకు మీ హీరో మీద ఉన్న ప్రేమను నేను అర్థం చేసుకోగలను.
కానీ మీరు ఇతరులను దూషించటం కరెక్ట్ కాదు.ఎవరికీ అయిన ఒక విషయం తెలియదంటే అది తప్పేం కాదు.
వారు అక్కడ నిజాయతీగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.తెలియని విషయాన్ని తర్వాత తెలుసుకుంటారు.
మనం ఏ విషయాలను నేర్చుకోవాలో వాటిని నేర్చుకోరు. రూల్స్‌ను బ్రేక్ చేస్తుంటారు.
అయితే ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు ఎవరికి ఎవరు తెలియకపోతే ఏంటి? అలాంటి వాటి పై ఎమోషనల్‌గా రియాక్ట్ కావటం అనేది వారి ఇమ్మేట్యురిటీని తెలియజేస్తుంది అని చెప్పుకొచ్చింది సింగర్ చిన్మయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy