ఎస్సీ నియోజకవర్గానికి నీళ్లు వదలాలంటే మీకెందుకు అంత బాధ - ఎమ్మెల్యే పద్మావతి

అనంతపురం: సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్ బుక్ లో హాట్ కామెంట్స్.పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే పద్మావతి.

సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్నచూపు.ఒక ఎస్సీ మహిళ ను కాబట్టే అంత చిన్న చూపా?? ఎస్సీ నియోజకవర్గానికి నీళ్లు వదలాలంటే మీకెందుకు అంత బాధ.సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావాలంటే ప్రతిసారి యుద్ధం చేయాల్సి వస్తోంది.మా కాలువల ద్వారా కుప్పంకు నీళ్లు తీసుకెళ్తుంటే చూసి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా.

మాకు నీరు రాకుండా కొంతమంది సీఎం వద్ద పంచాయితీలు పెట్టే స్టేజ్ కి వెళ్ళింది.జిల్లా నేతలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా, ఇరిగేషన్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన.

కనీసం ఒక్క చెరువుకు నీరు విడుదల చేయాలని అడిగితే కూడా జిల్లా అధికారులు పట్టించుకోలేదు.ఐదు సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు.ప్రజలకు ఇవ్వాల్సిన తాగు, సాగునీటి ఇవ్వడం కోసం పోరాటాలు చేయాల్సి వస్తుంది.

Advertisement
నగ్నంగా పూజ చేస్తే లక్ష్మీదేవి వరిస్తుంది... విద్యార్థినిని మభ్యపెట్టిన కేటుగాళ్లు?

తాజా వార్తలు