ఎసిడిటీతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే!

ఎసిడిటీ..

( Acidity ) చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేసే జీర్ణ సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి.

ఏదైనా ఆహారం తీసుకోగానే పుల్లటి త్రేన్పులు, గుండెలో మంట, చిరాకు, కడుపులో మంట, ఆహారం నోటిలోకి వచ్చినట్లు ఉండ‌టం, ఛాతీలో మంట‌ వంటివి ఎసిడిటీ లక్షణాలు.

ఎసిడిటీ సమస్య ఉంటే ఏం తినాలన్నా భయపడుతుంటారు.ఈ క్రమంలోనే ఎసిడిటీ సమస్యను వదిలించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.

మీరు కూడా తరచూ ఎసిడిటీతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను మీరు తెలుసుకోవాల్సిందే.ఈ చిట్కాలతో ఈజీగా ఎసిడిటీకి బై బై చెప్పవచ్చు.

Advertisement

ఎసిడిటీతో బాధ‌ప‌డుతున్నవారు ప్రతిరోజు ఉదయం నాలుగు పుదీనా ఆకుల( Mint leaves )ను నోట్లో వేసుకుని నమిలి తినాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ ను సేవించాలి.

ఇలా కనుక చేస్తే పుదీనా ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఎసిడిటీ సమస్యను సమర్థవంతంగా నివారిస్తాయి.

అలాగే జీర్ణక్రియ రేటును పెంచే సామర్ధ్యం దాల్చిన చెక్కకు ఉంది.అందువల్ల ఆంగ్లం దాల్చిన‌ చెక్కను ( Cinnamon )ఒక గ్లాసు వాటర్ లో వేసి బాగా మరిగించి ఆ నీటిని తీసుకోవాలి.ఇలా కనుక చేస్తే ఎసిడిటీ మాత్రమే కాదు గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్య‌లు సైతం వేధించకుండా ఉంటాయి.

ఉసిరి పొడి కూడా ఎసిడిటీ( Acidity ) సమస్యకు చెక్ పెడుతుంది.వన్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడిలో( Amla Powder ) రెండు టేబుల్ స్పూన్ల తేనె( Honey ) కలిపి తీసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే ఎసిడిటీ సమస్యకు బై బై చెప్పవచ్చు.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

ఇక భోజనం చేయడానికి గంట ముందు ఒక గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలిపి తీసుకోండి.ఇలా కనుక చేస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

Advertisement

తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది.ఎసిడిటీ సమస్య వేధించకుండా ఉంటుంది.

తాజా వార్తలు