గంటల కొద్ది జిమ్‌, వర్కౌట్స్‌ అక్కర్లేదు.. ఈ చిన్న పనులు చేస్తే ఎంతో ప్రయోజనం

తప్పు జరిగిన తర్వాత దాని గురించి బాధ పడటం అనేది వృదా.తప్పు జరుగకుండా జాగ్రత్తగా ఉండటమే ముందు జాగ్రత్త.

ఏదైనా చేసే సమయంలో ముందు జాగ్రత్తగా ఆలోచిస్తే తప్పకుండా దాని ఫలితం ఉంటుంది.అలాగే ఇష్టం వచ్చిన సమయంలో, ఇష్టం వచ్చినవి తింటూ టైం, డైట్‌ రెండు పాటించక పోవడం వల్ల లావు అవ్వడం, ఆ తర్వాత అయ్యో అయ్యో అనుకుంటూ బాధపడుతూ జిమ్‌ లో వర్కౌట్‌ లు చేయడం ఎంతో మంది చేసే పని.అయితే కాస్త జాగ్రత్తగా ఉంటే జిమ్‌కు వెళ్లాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకంటే లేదు.

బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటూ వైధ్యులు చెబుతున్నారు.అందులో ముఖ్యమైదని మనం ఎంత తింటామో దాన్ని ఖర్చు చేసేంత శ్రమ చేయాలి.తిన్న వెంటనే విశ్రాంతి తీసుకోవడం వల్ల లావు ఎక్కువ అవుతారు.

అందుకే తినగానే విశ్రాంతి తీసుకోకుండా కాస్త వాకింగ్‌ కాని, ఏదైనా చిన్న చిన్న పనులు కాని చేసుకోవాలి.అలా చేయడం వల్ల తిన్న ఆహారం వెంటనే అరిగి శక్తి రూపంలో బయటకు వచ్చేస్తుంది.

Advertisement

అలా కాదని తినగానే పడుకుంటే పొట్ట రావడంతో పాటు, రావు అవుతారు.

ఇక తినడం కంటే ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అంటూ వైధ్యులు సూచిస్తూ ఉంటారు.మంచి నీరు కాని, జ్యూస్‌ లు కాని ఎక్కువగా తీసుకోవడం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటారు.జిమ్‌కు వెళ్లిన వారికి కూడా వాటర్‌ ఎక్కువ తాగాలంటూ ట్రైనర్స్‌ సూచిస్తూ ఉంటారు.

ఒక మనిషి రోజులో కనీసం అయిదు లీటర్ల వాటర్‌ అయినా తాగాలని అంటూ ఉంటారు.ఏం తిన్నా, ఎంత తిన్నా కూడా సమయ పాలన అనేది ఖచ్చితంగా పాటించాలి.

అలా పాటిస్తూ తింటేనే లావు కాకుండా ఉంటారు.ఇష్టం వచ్చినప్పుడు తింటూ, పడుకుంటే లావు అవుతారు.

కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!

ముఖ్యంగా రాత్రి సయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.రాత్రి పూట చాలా లైట్‌ ఫుట్‌ తీసుకోవడంతో పాటు, జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

Advertisement

రుచిగా ఉన్నాయి కదా అని అయిల్‌ ఫుడ్‌ ఎక్కువ తింటే ప్రమాదం.ఇక కొవ్వు పదార్థాలను ఎక్కువగా తింటే ప్రమాదం ఖాయం.లావు అయిన తర్వాత జిమ్‌కు వెళ్లి కష్టపడే బదులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే లావు అవ్వకుండా ఉండవచ్చు.

ప్రతి ఒక్కరు ఈ చిన్న చిన్న ఆహారపు అలవాట్లు చేసుకుంటే తప్పకుండా మంచి ఆరోగ్యంతో లైఫ్‌ను సాగించవచ్చు.

తాజా వార్తలు