ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే క్లియ‌ర్ & గ్లోయింగ్ స్కిన్ మీసొంతం!

క్లియ‌ర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాల‌ని అంద‌రూ ఆశ‌ప‌డ‌తారు.ముఖ్యంగా అమ్మాయిల‌కు ఆ ఆశ కాస్త ఎక్కువే ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే ఆ ఆశ‌ను నెర‌వేర్చుకోవ‌డం కోసం ఖ‌రీదైన క్రీమ్స్‌, జెల్స్‌, సీర‌మ్స్‌, మాయిశ్చ‌రైజ‌ర్స్ వాడుతుంటారు.మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ఫేస్ మాస్క్‌ల‌ను త‌ర‌చూ ప్ర‌య‌త్నిస్తుంటారు.

అలాగే చ‌ర్మ‌పై ఎన్నెన్నో ప్ర‌యోగాలు చేస్తుంటారు.అయినా స‌రే ఏదో ఒక స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాను పాటిస్తే క్రిస్ట‌ల్‌ క్లియ‌ర్ అండ్ గ్లోయింగ్‌ స్కిన్ మీ సొంతం అవుతుంది.మ‌రి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం ప‌దండీ.

Advertisement
ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే క�

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ గులాబీ రేక‌ల పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ ముల్తానీ మ‌ట్టి, వ‌న్ టేబుల్ స్పూన్ పెస‌ర‌పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ చంద‌నం పొడి, చిటికెడు క‌స్తూరి ప‌సుపు, వ‌న్ టేబుల్ స్పూన్‌ సోప్ న‌ట్‌ పౌడ‌ర్‌(కుంకుడు కాయ పొడి) వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.చివ‌రిగా ఇందులో స‌రిప‌డా రోజ్ వాట‌ర్ వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే క�

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు ఏదైనా బ్రెష్ సాయంతో అప్లై చేసుకుని ఓ ఐదు నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఆపై మెల్ల మెల్ల‌గా వేళ్ల‌తో రుద్దుకుంటూ వాట‌ర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేసుకోవాలి.ఈ చిట్కాను రోజుకు ఒక‌సారి పాటిస్తే చ‌ర్మంపై మొటిమ‌లు, ముదురు రంగు మ‌చ్చ‌లు తొల‌గిపోయి ముఖం క్లియ‌ర్‌గా, గ్లోయింగ్ గా మారుతుంది.

చ‌ర్మ ఛాయ పెరుగుతుంది.మ‌రియు ఆయిలీ స్కిన్‌తో ఇబ్బంది ప‌డే వారు సైతం ఈ చిట్కాను పాటించ‌వ‌చ్చు.

ఎందుకంటే, చ‌ర్మంపై అద‌న‌పు జిడ్డును ఈ ప్యాక్ గ్రేట్ గా వ‌దిలిస్తుంది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు