ఈ సింపుల్ చిట్కాను ట్రై చేస్తే మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు మాయ‌మే!

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో మండే ఎండ‌ల కార‌ణంగా చెమ‌ట‌లు అధికంగా ప‌డుతుంటాయి.ఈ చెమ‌ట‌ల వ‌ల్ల మురికి, మృత‌క‌ణాలు చ‌ర్మంపై పేరుకుపోయి మొటిమ‌లు వ‌స్తుంటాయి.

కొంద‌రికి అయితే ఆ మొటిమ‌లు మ‌చ్చ‌లుగా కూడా మారుతుంటాయి.దాంతో వాటిని నివారించుకోవ‌డం కోసం ఖ‌రీదైన క్రీములు వాడుతుంటారు.

ఫేస్ మాస్క‌లు వేసుకుంటారు.అయినా త‌గ్గ‌కుంటే చ‌ర్మ నిపుణుల‌ను సంప్ర‌దించి మందులు సైతం వాడ‌తారు.

అయితే అంత వ‌ర‌కు వెళ్ల‌కుండా ఇంట్లోనే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాను ట్రై చేస్తే గ‌నుక మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు మాయం అవ్వ‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ముందుగా ఒక క‌ప్పు పొట్టు తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డిగిన‌ గుమ్మ‌డి కాయ ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి వాట‌ర్ సాయంతో మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ నుండి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల గుమ్మ‌డి కాయ జ్యూస్‌, ఒక గుడ్డు ప‌చ్చ‌సొన వేసి హ్యాండ్ బ్లెండ‌ర్ సాయంతో మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఇందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె మ‌రియు హాఫ్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి మ‌ళ్లీ ఒక‌సారి క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు బాగా ఆర‌బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత నార్మ‌ల్ వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకుని ఏదైనా మంచి మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.

రోజుకు ఒక‌సారి ఇలా చేస్తే గ‌నుక మొటిమ‌లు రెండు లేదా మూడు రోజుల్లోనే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.అలాగే మొటిమ‌ల తాలూకు మ‌చ్చ‌లు సైతం క్ర‌మంగా మాయం అవుతాయి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

కాబ‌ట్టి, ఈ సింపుల్ చిట్కాను త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

Advertisement

తాజా వార్తలు