వర్షాకాలంలో ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అన‌రు!

ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో చాలా మంది అధిక హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యతో బాధపడుతుంటారు.

వర్షాల్లో ఎక్కువ తడవడం, వాతావరణంలో వచ్చే మార్పులు ఇందుకు ప్ర‌ధాన కార‌ణం కాగా.ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తదితర కారణాల వల్ల కూడా హెయిర్ లాస్ జ‌రుగుతుంది.

అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు.కానీ వర్రీ వద్దు.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అన‌రు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో అవిసె గింజల జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్( Boiled rice ), అర కప్పు ఉల్లిపాయ ముక్కలు( onion slices ), హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకోవాలి.

చివరగా అవిసె గింజల జెల్ ను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

ప్రస్తుత వర్షాకాలంలో వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.దీంతో కురులు రాల‌డం ఆగుతుంది.

Advertisement

అలాగే ఈ రెమెడీ జుట్టును ఒత్తుగా మరియు పొడుగ్గా పెంచడానికి సైతం ఉత్తమంగా సహాయపడతాయి.కాబట్టి వర్షాకాలంలో హెయిర్ ఫాల్ సమస్యకు దూరంగా ఉండాలని భావించేవారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు