Pigmentation : పిగ్మెంటేషన్ తో వర్రీ వద్దు.. ఈ సింపుల్ రెమెడీ తో ఈజీగా క్లియర్ స్కిన్ ను మీ సొంతం చేసుకోండి!

పిగ్మెంటేషన్( Pigmentation ).ఇటీవల కాలంలో చాలా మందిని కలవర పెడుతున్న చర్మ సమస్యల్లో ఒకటి.

పిగ్మెంటేషన్ కారణంగా చర్మంపై ముదురు రంగు ప్యాచ్ లు పడుతుంటాయి.ఇవి నిరంతరం ఇబ్బంది కలిగిస్తాయి.

అందం మొత్తాన్ని పాడు చేస్తాయి.పలు రకాల మందుల వాడకం, దీర్ఘకాలిక వ్యాధులు, ఎండల్లో ఎక్కువగా తిరగడం, అలెర్జీలు లేదా వంశపారంపర్యత వల్ల పిగ్మెంటేషన్ సమస్య తలెత్తుతుంది.

అయితే ఈ సమస్యను నివారించడానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా సహాయపడతాయి.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా ఆ కోవకే చెందుతుంది.

Advertisement

రెగ్యుల‌ర్ గా ఈ రెమెడీని పాటించారంటే చాలా సులభంగా పిగ్మెంటేషన్ సమస్యను వదిలించుకోవచ్చు.క్లియర్ స్కిన్ ను పొందవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని బంగాళాదుంప ముక్కలు, కొన్ని టమాటో( Tomato ) ముక్కలు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ స‌పరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పొడి, చిటికెడు జాజికాయ పొడి వేసుకోవాలి.అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో బంగాళదుంప జ్యూస్ ( Potato Juice)ను కూడా వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Advertisement

నిత్యం ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ ను గమనిస్తారు.ఈ రెమెడీ పిగ్మెంటేషన్ సమస్యను చాలా త్వరగా దూరం చేస్తుంది.అదే సమయంలో చర్మం పై ఎలాంటి ముదురు రంగు మ‌చ్చ‌లు ఉన్న వాటిని మాయం చేస్తుంది.

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అయ్యేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి.

తాజా వార్తలు