హెయిర్ ఫాల్ తీవ్రంగా బాధిస్తుందా? అయితే ఈ రెమెడీ మీకోస‌మే!

హెయిర్ ఫాల్‌.కోట్లాది మందిని క‌ల‌వ‌ర పెట్టే కామ‌న్ స‌మ‌స్య ఇది.

వ‌య‌సు పైబ‌డే కొద్ది జుట్టు రాల‌డం, తెల్ల బ‌డ‌టం స‌ర్వ సాధార‌ణం.

కానీ, ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది చిన్న వ‌య‌సులోనే హెవీ హెయిర్ ఫాల్‌తో తీవ్రంగా బాధ‌ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే జుట్టు రాల‌డాన్ని అరిక‌ట్ట‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఒక‌వేళ ఎన్ని చిట్కాలు పాటించినా, మ‌రెన్ని మందులు వాడినా స‌మ‌స్య‌ ప‌రిష్కారం కాకుంటే.త‌మ హెయిర్ ఫాల్‌కు సొల్యూష‌న్ లేద‌ని భావిస్తున్నారు.

కానీ, అది అవాస్త‌వం.స‌రైన ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తే ఎంత‌టి తీవ్ర‌మైన హెయిర్ ఫాల్‌ను అయినా సుల‌భంగా నివారించుకోవ‌చ్చు.

Advertisement

ముఖ్యంగా అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీ సూప‌ర్‌గా వ‌ర్కోట్ అవుతుంది.మ‌రి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందు నాలుగు జామ ఆకులు, నాలుగు మందార ఆకులు, గుప్పెడు మెంతాకులు, గుప్పెడు క‌రివేపాకు తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి.

అలాగే రెండు ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని గింజ తొల‌గించి చిన్న చిన్న‌ ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌డిగి పెట్టుకున్న ఆయా ఆకులు, క‌ట్ చేసుకున్న ఉసిరి కాయ ముక్క‌లు, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మ‌ర‌సం వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ పేస్ట్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని అన్ని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు క‌దుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.రెండు గంట‌ల అనంత‌రం మైల్డ్ షాంపూను ఉప‌యోగించి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే గ‌నుక హెయిర్ ఫాల్ స‌మ‌స్య క్ర‌మంగా దూరం అవుతుంది.

వంట‌ల్లో టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారా.. అయితే ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు