వర్షాకాలంలో వేధించే గొంతు నొప్పి.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి!

ప్రస్తుత ఈ వర్షాకాలం( Rainy Season )లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి.

ముఖ్యంగా జలుబు దగ్గు వంటివి ఈ సీజన్లో బాగా ఇబ్బంది పెడుతుంటాయి.

అలాగే చాలా మంది గొంతు నొప్పితో కూడా బాధపడుతుంటారు.గొంతు నొప్పి కారణంగా ఏమన్నా తినాలన్నా.

ఇతరులతో మాట్లాడాలన్నా చాలా బాధాకరంగా మరియు అసౌకర్యంగా ఉంటుంది.ఈ క్రమంలోనే గొంతు నొప్పి( Sore Throat pain ) తగ్గడానికి మందులు వాడుతుంటారు.

అయితే సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు అద్భుతంగా సహాయపడతాయి.

Advertisement
Simple Home Remedies To Get Rid Of Throat Pain!, Throat Pain, Throat Pain Relief

మరి లేటెందుకు గొంతు నొప్పికి చెక్ పెట్టే ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Simple Home Remedies To Get Rid Of Throat Pain, Throat Pain, Throat Pain Relief

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి( Pepper Powder ) వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము కూడా వేసి మరొక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు ఈ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే ఎలాంటి గొంతు నొప్పి అయినా పరారవుతుంది.

జలుబు, దగ్గు( Cold and Cough ) వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.ఉసిరికాయ( Amla )తో కూడా గొంతు నొప్పిని నివారించుకోవచ్చు.అందుకోసం ఒకటి లేదా రెండు ఉసిరికాయలు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని.స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను కలిపి మూడు పూటలా తాగాలి.ఇలా చేసిన కూడా గొంతు నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.

అలాగే గొంతు నొప్పిని నివారించడానికి మరొక అద్భుతమైన చిట్కా ఉంది.అందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి( Ginger Powder ), పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసి సేవించాలి.ఈ డ్రింక్ కూడా గొంతు నొప్పికి సులభంగా చెక్ పెడుతుంది.

రెండు మూడు రోజుల్లోనే గొంతు నొప్పి త‌గ్గు ముఖం పడుతుంది.

తాజా వార్తలు