ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ నా బెస్ట్ ఫ్రెండ్స్.. కానీ అంటూ ఫ్రెండ్షిప్ గుర్తు చేసుకున్న అంకిత!

లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయి అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి అంకిత( Ankitha ) .

ఇలా నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె 2009వ సంవత్సరం నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అంకితం వివాహ బంధంలోకి అడుగుపెట్టి అనంతరం తన భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు.ఇలా అమెరికాలో ఉన్నటువంటి ఈమె తన భర్త పిల్లలతో కలిసి తన పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

చాలా సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి దూరమైనటువంటి అంకిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Uday Kiran Aarti Agarwal Are My Best Friends, Ankitha, Arthi Aggarwal, Uday Kira

ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అంకిత ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు ఆర్తి అగర్వాల్( Arthi Aggarwal ) ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఈమె తెలిపారు.అయితే తన ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లోకంలో లేరని ఎమోషనల్ అయ్యారు.

Advertisement
Uday Kiran Aarti Agarwal Are My Best Friends, Ankitha, Arthi Aggarwal, Uday Kira

ఇక ఆర్తి అగర్వాల్ తాను చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం తను కూడా పెళ్లి చేసుకుని అమెరికాలోనే ఉండేది ఇద్దరు చాలా సార్లు కలిసామని మా సిస్టర్ పెళ్లికి కూడా వచ్చిందని అంకిత తెలిపారు.

Uday Kiran Aarti Agarwal Are My Best Friends, Ankitha, Arthi Aggarwal, Uday Kira

ఇక ఉదయ్ కిరణ్ నేను ఒక సినిమా చేయాల్సి వచ్చింది ఇలా సినిమా ఓకే అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది.ఈ విధంగా సినిమా ఆగిపోయిన ఉదయ్ కిరణ్ నేను చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము.హైదరాబాద్ లో ఉంటే తనని కలిసేదాన్ని కాకపోతే తనని కలిసే ఛాన్స్ లేకుండా పోయిందని ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా అందనంత దూరంలోకి వెళ్లిపోయారంటూ అంకిత ఆర్తి అగర్వాల్ ఉదయ్ కిరణ్ ని తలుచుకుంటూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఆర్తి అగర్వాల్ ప్రమాదవశాత్తు మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఉదయ్ కిరణ్ కొన్ని కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుని మరణించారు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు