గత కొంతకాలంగా వెండి ధరలు( Silver Price ) అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి.ఈ క్రమంలోనే త్వరలో వెండి ధర ఒక కేజీ రూ.
85 వేల రేంజ్ కు చేరుకుంటుందని మోతిలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొవడం ఇపుడు చాలమందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ నేపథ్యంలో వెండి ధరలు భవిష్యత్తులో ఒక లక్ష రూపాయలకు చేరే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.2023 సంవత్సరంలో వెండి మొదటి 4 నెలల్లో భారీగా క్షీణించగా ఇపుడు మాత్రం సిల్వర్ ధరకు రెక్కలు వచ్చి నింగికి ఎగురుతున్న పరిస్తితి వుంది.ఈ నేపధ్యంలో వెండి వ్యాపారస్థులు వ్యాపారం చేయలేక సతమతమౌతూ వున్నారు.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్( Motilal Oswal Financial Services ) నివేదిక ప్రకారం, వెండి ఈ ట్రెండ్‌ను మరింత కొనసాగిస్తుంది.గత కొన్ని నెలల గణాంకాలను పరిశీలిస్తే, గత నాలుగు నెలల్లో వెండి ధరలు మొత్తం 11 శాతం పెరిగాయి.రానున్న 12 నెలల్లో వెండి ధర రూ.85,000కి చేరవచ్చని ఈ నివేదిక తాజాగా అంచనా వేసింది.అంతేకాకుండా రాబోయే కొద్ది త్రైమాసికాల్లో వెండి 15 శాతం జంప్‌ను చూస్తుందని అంచనా వేసింది.బ్రోకింగ్ సంస్థ రూ.70,500 వద్ద తక్షణ మద్దతుతో దిగువ స్థాయిలో స్థిరమైన కొనుగోలు సిఫార్సు చేసింది, నివేదిక ప్రకారం, వెండి ధరలు రాబోయే 12 నెలల్లో రూ.82,000 - రూ.85,000 రేంజుకు చేరవచ్చని నివేదిక వెల్లడించింది.
ఇకపోతే US బ్యాంకింగ్ , క్రెడిట్ రంగాలలో ఆందోళనల కారణంగా బంగారంతో పాటు వెండిధరలు కూడా భారీగా పెరిగాయి, అయితే ఫెడరల్ రిజర్వ్ "దూకుడు ద్రవ్య విధానం"( Monetary Policy ) ర్యాలీని కొంత స్టాప్ చేసింది.US వినియోగదారుల ధరల సూచిక (CPI) జూలై 2022లో గరిష్ట స్థాయి 9.1 శాతం నుండి 3.2 శాతానికి పడిపోయింది.దీంతో సమీప భవిష్యత్తులో వెండి మరింత పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు, సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వెహికల్ (EV), , 5G వంటి గ్రీన్ టెక్నాలజీలలో వెండికి డిమాండ్ మార్కెట్‌కు మరింత ఆశను తెస్తుంది.పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ గ్రైమ్ టెక్నాలజీ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అదేవిధంగా పండుగల సీజన్‌లో దేశీయంగా డిమాండ్ కారణంగా వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy