ఎన్టీఆర్ అమిత్ షా భేటీపై తెలుగు త‌మ్ముళ్ల సైలెన్స్..!!

ప‌స్తుతం ఇటు ఏపీలో అటు తెలంగాణ‌లో రాజ‌కీయంగా కాక‌రేపుతున్న అంశం అమిత్ షా.జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ కావడం.

ఈ భేటీపై ఇప్ప‌టికే ఎన్నో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డుతున్న త‌రుణంలో.

అటు ఏపీలో టీడీపీ బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్న క్ర‌మంలో ఇలా తార‌క్ తో భేటీ కావ‌డం ఆస‌క్తి రేపుతోంది.తెలుగు రాష్ట్రాల్లోమంచి ఇమేజ్ ఉన్న హీరో ఎన్టీఆర్.

ఇక ఇటీవ‌ల వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీతో ప్ర‌పంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు.దీంతో మ‌రింత సంచ‌ల‌నం రేపుతోంది.

Advertisement
Silence Of Tdp Leaders On NTR Amit Shah Meeting Details, Amith Shah, Junior NTR,

ఎన్టీఆర్ టీడీపీతో విడదీయలేని బంధం ఉన్న వ్య‌క్తి.గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం కూడా చేప‌ట్టారు.

అయితే రాజ‌కీయాల‌కు మాత్రం దూరంగా ఉంటాన‌ని చెప్పిన ఎన్టీఆర్ తాజాగా బీజేపీ అగ్రనేత షాతో భేటీ కావ‌డంతో ప‌లు పార్టీల్లో కంగార మొద‌లైంది.ఇది నిజ‌మేనా.? అయితే తెలంగాణ బీజేపీ కి ఓ స్టార్ క్యాంపైనర్ కావాలని భావిస్తున్నారని అందుకు తారక్ అయితే బాగుంటుందన్న వాదన ఒకటి వినిపిస్తోంది.ఎలానూ ఆంధ్రాలో పవన్ తో స్నేహం ఉంది కనుక తెలంగాణ వరకూ తారక్ సాయం తీసుకోవాలని చూస్తున్నారని స‌మాచారం.

అయితే ఈ వార్తలు కూడా చాలా మంది కొట్టిపారేస్తున్నారు.

Silence Of Tdp Leaders On Ntr Amit Shah Meeting Details, Amith Shah, Junior Ntr,

జూనియర్ అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరని వీలున్నంత వరకూ టీడీపీతోనే ఉంటార‌ని అంటున్నారు.కానీ ఎన్టీఆర్ కేంద్ర హోం మంత్రిని కలవడం సంచ‌ల‌న‌మే రేపుతోంది.నలభై ఐదు నిమిషాల పాటు సాగిన భేటీలో దేని గురించి చ‌ర్చించార‌న్న అంశం తెలియ‌రాలేదు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

అయితే అమిత్ షా మాత్రం ఆసక్తిక‌రంగా ట్వీట్ చేశారు.ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న నటుడ‌ని ప్రశంస పూర్వక వ్యాఖ్యానించారు.

Advertisement

దీంతో తెలుగు రాష్ట్రాల్లో టీడ‌పీ అభిమానులు డైలమాలో పడ్డారు.దీనిపై ఏం మాట్లాడాలో తెలియ‌క సైలెంట్ అవుతున్నారు.

అయితే ఈ భేటీపై కేసీఆర్ వర్గం మాత్రం మండిపడుతున్న‌ట్లు తెలుస్తోంది.మంచి ఇమేజ్ ఉన్న నటుడిని త‌మ ప్ర‌యోజ‌నాల‌కు బీజేపీ వాడుకోనుందా.

అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నది.అలా జ‌ర‌గొద్ద‌ని కూడా కోరుకుంటోంది.

తాజా వార్తలు