ఆస్ట్రేలియాలో జాతి విద్వేష ఘటన : ‘‘ ఏయ్ ఇండియన్ నీ దేశానికి పో ’’ అంటూ సిక్కు వ్యక్తికి బెదిరింపు లేఖలు

ఆస్ట్రేలియాలో( Australia ) భారత సంతతికి చెందిన సిక్కు రెస్టారెంట్ యజమానిపై( Sikh Restaurateur ) జాత్యహంకార దాడి జరిగింది .

ఆయన కారుపై మలమూత్ర విసర్జన చేయడం, నీ దేశానికి (భారత్) వెళ్లిపో అంటూ జాత్యహంకార వ్యాఖ్యలు రాయడం కలకలం రేపింది.

తాస్మానియాలోని హోబర్ట్‌లో ‘‘ దావత్ ది ఇన్విటేషన్ ’’( Dawat – The Invitation ) రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న జర్నైల్ జిమ్మీ సింగ్( Jarnail Jimmy Singh ) గత 15 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు.అయితే గత రెండు మూడు నెలలుగా తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

తనకు వచ్చిన లేఖను ఓ యువకుడు రాసి వుంటాడని సింగ్ తొలుత భావించి తర్వాత దానిని పట్టించుకోలేదు.ఆ తర్వాత వరుసగా నాలుగైదు రోజులు తన కారు డోర్ హ్యాండిల్స్‌పై కుక్కల మలమూత్రాలు పూశారని.

తాను ప్రయాణించే మార్గంలో "Go home, Indian" అని రాశారని ఆయన తెలిపాడు.ఈ ఘటనలపై సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన ఇంటి వద్ద సీసీ కెమెరాలు అమర్చాడు.

Advertisement

అయినప్పటికీ ఆయనకు ద్వేషపూరిత లేఖలు వస్తూనే వున్నాయి.

ఇటీవల వచ్చిన లేఖల్లో తనను దూషించడంతో పాటు అభ్యంతరకరంగా వున్నాయని సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి వెలుపల పార్క్ చేసిన కారుపై గీతలు గీశారని.ఇటువంటి చర్యలను అడ్డుకోవాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై తాస్మానియా పోలీస్ కమాండర్ జాసన్ ఎల్మెర్( Jason Elmer ) స్పందించారు.సింగ్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని.

జాతి విద్వేషం, పక్షపాతాలను ప్రేరేపించే ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని జాసన్ తెలిపారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

సమాజంలో శబ్ధ, శారీరక వేధింపులకు తావు లేదని, తాము పక్షపాతానికి గురైనట్లు భావిస్తే ప్రజలు తక్షణం పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.తనకు జరిగిన అనుభవాలు ఇతరులు ఎదుర్కోకుండా వుంటారని ఆకాంక్షించారు జర్నైల్ జిమ్మీ సింగ్. అందమైన ఆస్ట్రేలియాలో జాత్యహంకారానికి తావు లేదన్నారు.

Advertisement

ఈ విపత్కర పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన మద్ధతుదారులకు, తన కస్టమర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు