మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయ్ అనడానికి సంకేతాలు ఇవే..!

చాలామంది ప్రజలు తమకు సొంత ఇల్లు ఉండాలని ఎప్పుడూ కోరుకుంటుంటారు.ఎందుకంటే సొంత ఇల్లు ఇచ్చే సంతృప్తి ఇంకే స్వర్గము ఇవ్వలేదు.

మనది అన్న భావన అంతా బలంగా ఉంటుంది.అలాగే ప్రతి నిర్మాణానికి ఒక ఎనర్జీ ఉంటుంది.

అది పాజిటివ్ కావచ్చు.ఒక్కోసారి నెగిటివ్ కూడా కావచ్చు.

పాజిటివ్ ఎనర్జీతో( Positive Energy ) ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.ఆ ఇంట్లోకి( Home ) అడుగుపెట్టగానే ఒక రకమైన సంతోషం కలుగుతుంది.

Advertisement

కొన్ని ఇళ్లలో ఇలా ప్రశాంతంగా ఉండదు.అలాంటి ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ( Negative Energy ) చేరి ఉండవచ్చు.

నెగటివ్ ఎనర్జీ చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా నిద్ర వస్తుంది.

ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతు ఉంటాయి.ఇంట్లో చాలా ఎక్కువగా సాలిడ్లు చేరుతాయి.

ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతాయి.ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది.

40 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అమ్మవారి అలంకరణ...

తరచుగా ఇంట్లో ఒకరిని ఒకరు నిందించుకోవడం, కోపతాపాల్లో రోజులు గడుస్తూ ఉంటాయి.ఇలా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకూడదంటే ఇంట్లో వస్తువులు దుస్తులు ఎక్కడపడితే అక్కడ అలాగే వదిలేయకూడదు.ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

Advertisement

మురికి బట్టలు ఎక్కడపడితే అక్కడ ఉండకూడదు.నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి దూరం చేయడానికి పండితులు ఈ పరిహారాలను చెబుతున్నారు.

వాష్ రూమ్ లో ఒక గిన్నెలో కర్పూరం వేసి ఉంచాలి.ఇంటికి ఈశాన్యంలో నీటి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

ఇంట్లో తరచుగా ఉప్పు దీపం వెలిగించాలి.ఇంటిని శుభ్రం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త సముద్రపు ఉప్పు వేయడం మంచిది.ఇంట్లో కర్పూరంతో పాటు కొన్ని లవంగాలు వేసి కాల్చాలి.

ఇంట్లోని సోఫాలు, దివాన్ల వంటి పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడు ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు.అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇల్లు బోరు కొట్టకుండా కొత్తగా ఉంటుంది.

నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరదు.ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, పరిహారాలతో ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది.

తాజా వార్తలు