ఇంటికి కట్టిన గుమ్మడికాయ పాడైపోయిందా.. దాని అర్థం ఇదే!

మన హిందువులు ఎన్నో ఆచారవ్యవహారాలను పాటిస్తారు.ఈ క్రమంలోనే కొన్ని కొన్ని విషయాలలో ఎంతో గాఢంగా విశ్వసిస్తారు.

ఇలాంటి సమయంలోనే మన కుటుంబం ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే చాలా మంది ఓర్వలేరు.ఈ క్రమంలోనే ఆ ఇంటి పై చెడు దృష్టి పడటం వల్ల ఆ ఇంటిలో ఆర్థిక ఎదుగుదల ఆగిపోతుంది.

అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఆ కుటుంబాన్ని వెంటాడుతుంటాయి.ఇలాంటి చెడు ప్రభావం మన ఇంటి పై పడకుండా ఉండటం కోసం చాలామంది ఇంటి గుమ్మం దగ్గర బూడిద గుమ్మడి కాయను కడతారు.

ఈ విధంగా బూడిద గుమ్మడికాయ కట్టడం వల్ల ఆ ఇంటి పై ఏవిధమైనటువంటి చెడు దోషాలు, నరదృష్టి ఉండదని, మన ఇంట్లో ఏర్పడిన నెగటివ్ ఎనర్జీని మొత్తం గుమ్మడి కాయ తీసుకుంటుందని పండితులు చెబుతుంటారు.అందుకే మన ఇంటికి బూడిద గుమ్మడి కాయను కడతాము.

Advertisement

ఈవిధంగా నరదృష్టి నివారణకు బూడిద గుమ్మడికాయతో పాటు,గోమాత సహిత నవ యంత్ర యుక్త ఐశ్వర్య కాళీ ఫోటో ఇంటి లోపల గుమ్మం పై అమర్చుకోవడం వల్ల మన ఇంటి పై ఎలాంటి ప్రభావం ఉండదు.

ఈ విధంగా బూడిద గుమ్మడికాయ మన ఇంటిలో కట్టినప్పుడు బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోతే మన ఇంటి పై చెడు ప్రభావం, నరదృష్టి తీవ్రత అధికంగా ఉందని అర్థం.ఈ విధంగా గుమ్మడికాయ కుళ్ళిపోతే వెంటనే దానిని పడేసి దాని స్థానంలో పండితుల చేత మరొక గుమ్మడికాయ కట్టించాలి.ఈ విధంగా గుమ్మడికాయ కట్టిన తర్వాత ప్రతి రోజు మనం పూజ చేసేటప్పుడు రెండు అగరవత్తుల దూపం వేసి అగర్బత్తి లను వెలిగించడం ద్వారా మన ఇంటిలో ఏ విధమైనటువంటి చెడు ప్రభావం ఉండదని పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు