ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!

రోజు మొత్తంలో అత్యంత ముఖ్యమైన మీల్ ఏదంటే చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ అని అంటారు.అది నిజ‌మే.

కానీ లంచ్ మరియు డిన్నర్ కూడా ముఖ్యమైనవే.మ‌న‌లో చాలా మంది ఆక‌లిగా లేద‌ని, బ‌రువు త‌గ్గాల‌ని ఇలా ఏదో ఒక కార‌ణం చేత మ‌ధ్యాహ్నం లేదా రాత్రివేళ భోజ‌నాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు.

కొంద‌రైతే తినేందుకు స‌మ‌యం లేక భోజ‌నం మానేస్తుంటారు.అయితే భోజ‌నాన్ని స్కిప్ చేయ‌డం వ‌ల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ( Side effects )త‌లెత్తుతాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

త‌ర‌చూ లంచ్ లేదా డిన్న‌ర్ ను డుమ్మా కొట్ట‌డం వ‌ల్ల మీ శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు ( Carbohydrates, proteins, fats, vitamins )మరియు మినరల్స్ వంటి పోషకాలను కోల్పోతారు.ఇది అలసట, బలహీనతకు దారి తీస్తుంది.

Advertisement

అభిజ్ఞా పనితీరు దెబ్బ‌తింటుంది.ప‌ని విష‌యంలో చురుగ్గా ఉండ‌లేదు.

ఏకాగ్ర‌త క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

అలాగే భోజనం( meal ) దాటవేయడం వ‌ల్ల‌.తరువాతి సమయంలో అతిగా తినడానికి దారి తీస్తుంది.ఫుడ్ ను తీసుకోవ‌డంలో కంట్రోల్ కోల్పోతుంది.

నోటికి ఏది రుచిగా ఉంటే దాన్ని లాగించేస్తారు.ఫ‌లితంగా వెయిట్ గెయిన్ అవుతారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

పదే పదే భోజనం చేయడం మానేయడం వల్ల ముఖ్య‌మైన విటమిన్లు మరియు మినరల్స్ ను లాస్ అవుతారు.ఇది శరీర పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

Advertisement

దీర్ఘకాలిక వ్యాధులు, రక్తహీనత, బలహీనమైన ఎముకలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అంతేకాకుండా త‌ర‌చూ భోజ‌నాన్ని స్కిప్ చేస్తే మీ జీవక్రియ రేటు నెమ్మ‌దిస్తుంది.రోగనిరోధక వ్య‌వ‌స్థ బలహీన ప‌డుతుంది.లంచ్ లేదా డిన్నర్‌ను మానేసినప్పుడు చిరాకు మరియు మూడ్ స్వింగ్‌లకు దారితీస్తుంది.

ఒక్కోసారి రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి.భోజనం మానేయడం వల్ల కడుపు ఉబ్బరం, వికారం మరియు యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు సైతం ఇబ్బంది పెడ‌తాయి.

తాజా వార్తలు