టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

టమాటాలు.అనేక ర‌కాల వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తారు.ఏ వంట‌లో ఉప‌యోగించినా ట‌మాటా రుచే వేరు.

రుచిగా ఉండ‌డ‌మే కాదు.పోష‌కాలు కూడా ట‌మాటాల్లో మెండుగానే ఉంటాయి.

What Are The Side Effects Of Overeating Tomatoes?? Side Effects Of Tomatoes, Tom

ఎర్రగా నిగనిగలాడుతూ నోరూరించే టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంతో పాటు జలుబు, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల నుంచి కూడా ర‌క్షిస్తుంది.

అలాగే ట‌మాటాల్లో ఉండే విటమిన్‌ ఏ, విటమిన్ సి క‌ళ్ల‌కు, చ‌ర్మానికి ఎంతో మేలు చేకూర్చుతాయి.ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్‌ కె కూడా ట‌మాటాల్లో లభిస్తుంది.

Advertisement

ఇక ట‌మాటాల్లో ఉండే లైకోపీన్.కొలన్, ప్రొస్టేట్, లంగ్ కాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.

మ‌రియు మ‌ధుమేహం, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు ఉండేవారికి కూడా టమాటాలు మంచి ఆహారంగా చెప్పుకోవ‌చ్చు.అయితే ట‌మాటాలు ఆరోగ్యానికి మంచిదే.

కాని, అతిగా తింటే మాత్రం రిస్క్‌లో ప‌డిన‌ట్టు అవుతుంది.అవును! ఎక్కువ‌గా ట‌మాటాలు తీసుకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

వాస్త‌వానికి మ‌ధుమేహ రోగులు ట‌మాటా తీసుకుంటే.షుగ‌ర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుతుంది.

పిల్లలకు తీపి పదార్థాలు పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

అయితే అతిగా ట‌మాటా తింటే.షుగ‌ర్ లెవల్స్ మరింతగా క్షీణించేలా చేస్తుంది.

Advertisement

త‌ద్వారా అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.అలాగే ట‌మాటాలు అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు ఉబ్బరానికి దారితీస్తుంది.

అదే స‌మ‌యంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కూడా దారితీస్తుంది.ఇక ఎవ‌రైతే కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారో.

అలాంటి వారు ట‌మాటాలు తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.అదేవిధంగా, టమాటాలు ఆమ్లత్వం ఎక్కువగా కలిగి ఉంటాయి.

దీంతో ట‌మాటా అతిగా తీసుకున్న‌ప్పుడు గ్యాస్టిక్ స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతుంది.సో.బీకేర్‌ఫుల్‌!!.

తాజా వార్తలు