ఆరోగ్యానికి మంచిదని ఆవనూనె వాడుతున్నారా? అయితే కచ్చితంగా ఇవి తెలుసుకోండి!

ఆవ నూనె( Mustard oil ).దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

ఆవాల నుంచి తయారు చేసే ఈ నూనె ఘాటైన సువాసన కలిగి ఉంటుంది.ఖరీదు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆరోగ్యానికి మంచిది అన్న కారణంతో ఆవ నూనెను వంటలకు విరివిరిగా వాడుతున్నారు.ఆవ నూనెలో.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మోనో-అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.అందుకే ఆవ నూనె ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.

అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించినప్పటికీ ఆవ నూనెను అధికంగా వాడితే మాత్రం సమస్యల‌ను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.అవును, ఆవనూనెను అతిగా వాడటం వల్ల ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఆవ నూనెలో ఎరుసిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది.ఎరుసిక్ యాసిడ్ అనేది కూరగాయల నూనెలలో కనిపించే కొవ్వు ఆమ్లం.ఇది గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను పెంచుతుంది.

ఆవనూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల అలర్జీ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.ఆవ నూనెను నిరంతరం వాడటం వల్ల తరచూ తలనొప్పి( Headache ), వాంతులు, కాళ్ల వాపు వంటి సమస్యలు ఏర్పడతాయి.

గర్భిణీలు అయితే ఆవ నూనెను కంప్లీట్ గా ఎవైడ్ చేయాలి.ఎందుకంటే ఆవ నూనె గర్భస్రావానికి కారణం అవుతుంది.ఆవనూనెలో ఉండే ఎరుసిక్ యాసిడ్ ఊపిరితిత్తులను కూడా దెబ్బతీస్తుంది.

దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తదితర శ్వాస సంబంధిత సమస్యలు( Breathing problem ) ఏర్పడతాయి.అందుకే ఆవ నూనెను నిరంతరం ఉపయోగించడం మానుకోండి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

కనీసం మూడు నెలలకు ఒకసారి వంట నూనెను మారుస్తూ ఉండండి.

Advertisement

తాజా వార్తలు