జీలకర్ర ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం.. అనారోగ్య సమస్యలు..

ప్రతి వంటకాల్లో అధికంగా వాడే ఒకే ఒక్క పదార్థం జీలకర్ర .

ఇక వంట గదిలో ఎక్కువగా కనిపించే మొదటి ఆహార పదార్థం కూడా జీలకర్ర అని చెప్పాలి.

సాంబారు, రసం, ప్రతి ఒక్క కర్రీలో కూడా జీలకర్రను వాడుతారు.అయితే జీలకర్ర లేకుండా ఏ ఆహారం కూడా రుచిగా ఉండదు.

అయితే ఇది సాధారణ కూరగాయల రుచిని కూడా మార్చుతుంది.జీలకర్ర రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

అయితే జీలకర్రను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చాలా బలంగా మారుతుంది.

Side Effects Of Excess Consuming Cumin Seeds,cumin Seeds,jeera Powder,diabetes,d
Advertisement
Side Effects Of Excess Consuming Cumin Seeds,Cumin Seeds,Jeera Powder,Diabetes,D

అదేవిధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది.జీలకర్రను తీసుకోవడం వల్ల అనేక ఉదర సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి.అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి జీలకర్ర సహాయపడుతుంది.

అదేవిధంగా దగ్గు, బ్రౌన్ కైటిస్, అలర్జీ ఇలాంటి శ్వాసకోస వ్యాధులకు కూడా దూరంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జీలకర్ర వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.

అయితే జీలకర్ర ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ బర్న్ సమస్యలు తలెత్తుతాయి.అంతేకాకుండా మసాలాను పరిమిత పరిమాణంలో తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.

జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినడమే కాకుండా కిడ్నీలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.అందుకే వంటకాల్లో జీలకర్రను తక్కువగా వాడాలి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

అదేవిధంగా శరీరానికి ఫిల్టర్ గా పనిచేసే కిడ్నీలా పనితీరు దెబ్బ తినకుండా ఉండాలంటే జీలకర్ర తగ్గించడం చాలా అవసరం.మోతాదుకు మించి జీలకర్ర తీసుకోవడం వల్ల పుల్లటి తేన్పులు వస్తాయి.

Side Effects Of Excess Consuming Cumin Seeds,cumin Seeds,jeera Powder,diabetes,d
Advertisement

అందుకే జీలకర్రను అధికంగా తీసుకోకపోవడం మంచిది.ఎక్కువగా తీసుకుంటే ఇది శరీరంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది.దీంతో బలహీనత, మైకం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

ఇక సర్జరీ చేయించుకున్న వాళ్లు కూడా జీలకర్ర తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఆపరేషన్ చేసుకునే సమయంలో రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండడం చాలా అవసరం.

అందుకే డాక్టర్లు జీలకర్రకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు.ఇక అతి ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

దీనివల్ల రక్తస్రావం అధికంగా జరిగే ప్రమాదం ఉంది.అదేవిధంగా గర్భిణీలు కూడా వైద్యుల సలహా మేరకే జీలకర్రను వాడాలి.

తాజా వార్తలు