కొబ్బ‌రి నీళ్లు ఆరోగ్యానికి మంచివే కానీ.. అలా తీసుకుంటే చాలా ప్ర‌మాదం!

స్వ‌చ్ఛ‌మైన మ‌రియు రుచిక‌ర‌మైన పానియాల్లో కొబ్బ‌రి నీళ్లు ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.అందులో ఎటువంటి సందేహం లేదు.

కొబ్బ‌రి నీటిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విట‌మిన్ సితో స‌హా శ‌క్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య ప‌రంగా కొబ్బ‌రి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి.

కానీ, హెల్త్‌కి మంచిద‌నో లేదా రుచిగా ఉన్నాయ‌నో చెప్పి అతిగా కొబ్బ‌రి నీటిని సేవిస్తే చాలా ప్ర‌మాదం అని అంటున్నారు పోష‌కాహార నిపుణులు.అస‌లు కొబ్బ‌రి నీటిని ఓవ‌ర్ గా తీసుకుంటే ఏయే స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ర‌క్త‌పోటు స్థాయిల‌ను త‌గ్గించే సామ‌ర్థం కొబ్బ‌రి నీళ్ల‌కు ఉంది.అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డేవారికి ఇది వ‌ర‌మే.

Advertisement

కానీ, లో బీపీ స‌మ‌స్య ఉన్న వారు మాత్రం అతిగా కొబ్బ‌రి నీటిని సేవిస్తే.ర‌క్త‌పోటు స్థాయిలు మ‌రింత దిగ‌జారి ప్రాణాలే రిస్క్‌లో ప‌డ‌తాయి.

అలాగే కొబ్బ‌రి నీటిలో చక్కెర స్థాయిలు త‌క్కువ‌గా ఉన్నా.కేల‌రీలు అధిక మొత్తంలో ఉంటాయి.

అందువ‌ల్ల‌, కొబ్బరి నీరును ప‌రిమితికి మించి తీసుకుంటే బ‌రువు పెరిగే అవ‌కాశాలు ఉంటాయి.మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు చాలా లిమిట్‌గా కొబ్బ‌రి నీళ్ల‌ను సేవించాలి.

లేదంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపు త‌ప్పే రిస్క్ చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.కొబ్బ‌రి నీరు మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది.

Lorem Ipsum Dolor Sit Amet
Lorem Ipsum Dolor Sit Amet

అందువ‌ల్ల‌, కోక‌న‌ట్ వాట‌ర్‌ను ఓవ‌ర్‌గా తీసుకుంటే త‌ర‌చూ మూత్రవిసర్జన చేయాల్సిన ప‌రిస్థితి ఏర్పడుతుంది.అంతేకాదు, కొబ్బ‌రి నీళ్లను లిమిట్ లేకుండా తీసుకుంటే ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కారణం అవుతుంది.

Advertisement

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు దెబ్బ తింటుంది మ‌రియు జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు సైతం త‌లెత్తే అవ‌కాశాలు ఉంటాయి.అందుకే అతి అన‌ర్థ‌దాయ‌కం అన్నారు పెద్ద‌లు.

ఇందుకు కొబ్బ‌రి నీళ్లు కూడా మిన‌హాయింపు కాదు.కాబ‌ట్టి, ఆరోగ్యానికి ఎంత‌ మేలు చేసిన‌ప్ప‌టికీ.

రోజుకు ఒక గ్లాస్ మించి కొబ్బ‌రి నీళ్ల‌ను తీసుకోరాదు.