ఈ రెండు కలిపి తింటున్నారా ..? అయితే జాగ్రత్త సుమా..!

కాలం మారుతున్న కొద్దీ ప్రజలు తీసుకుంటున్న ఆహార పద్ధతుల్లో అనేక మార్పులు సంభవిస్తున్నాయి.ప్రస్తుత కాలంలో సలాడ్స్ కు ప్రత్యేక స్థానం ఏర్పడింది.

చాలా మంది వారికి నచ్చిన విధంగా ఎన్నో రక రకాల కాంబినేషన్స్ లో సలాడ్స్ ను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.అయితే ఇందులో ఎక్కువగా కీర దోసకాయ అలాగే టమాటా ముక్కలను తీసుకోవడానికి ఇష్ట పడుతున్నారు.

Eating Tomato And Cucumber Salad Dangerous To Health, Tomato, Cucumber, Mixed, E

అయితే ఈ రెండు విడివిడిగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.రెండు కలిపి తీసుకుంటేనే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దామా.చాలామంది ఎంతో ఇష్టంగా తినే టమాటా, కీరదోస కాంబినేషన్ చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

ఇందుకు సంబంధించి తాజాగా జరిగిన ఓ పరిశోధనలో ఓ విషయం వెల్లడైంది.అందులో రెండు పదార్థాలను విడివిడిగా తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని చెబుతూనే.

ఈ రెండింటి కాంబినేషన్ కలిపి తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ద్వారా కడుపులో నొప్పి రావడం, అలాగే గ్యాస్ సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ముఖ్యంగా గ్యాస్, ఉబ్బరం, అలసట అలాగే జీర్ణానికి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.ఇక ఇందుకు గల కారణం చూస్తే.

ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కడుపులో ఎక్కువగా యాసిడ్స్ తయారవుతాయని వారు చెబుతున్నారు.అంతే కాదు శరీరంలోని జీర్ణక్రియ రేట్ కూడా దెబ్బతింటుందని వారు తెలుపుతున్నారు.

పిల్లలకు తీపి పదార్థాలు పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

వీటితో పాటు కడుపు ఉబ్బరంగా ఉంటుందని కూడా వారు తెలుపుతున్నారు.మామూలుగా కీర దోసకాయ తిన్న తర్వాత చాలా త్వరగా జీర్ణం అవుతుంది.

Advertisement

అయితే టమాటా విషయానికి వచ్చే సరికి జీర్ణం కావడానికి పూర్తిగా ఎక్కువ సమయం తీసుకుంటుందని వారు తెలుపుతున్నారు.ముఖ్యంగా టమాటా లో ఉండే గింజలు అరగడానికి ఎక్కువగా సమయం తీసుకుంటుందట.

కాబట్టి వీలైనంత వరకు ఈ రెండింటి కాంబినేషన్ ఒకేసారి తినకుండా ఒకదాని తర్వాత ఒకటి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.

తాజా వార్తలు