టక్కర్ రివ్యూ: సిద్ధార్థ్ హిట్ కొట్టనట్లేనా?

డైరెక్టర్ కార్తీక్ జి క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా టక్కర్.

( Takkar Movie ) ఇందులో సిద్ధార్థ్( Siddharth ) హీరోగా నటించగా ఆయన సరసన దివ్యాన్ష కౌశిక్( Divyansha Kaushik ) హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా యాక్షన్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో రూపొందగా.తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమాకు నివాస్ కే ప్రసాద్ మ్యూజిక్ అందించారు.ఈ సినిమా విడుదలకు ముందు సిద్ధార్థ్ ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు.

జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొని చాలా విషయాలు పంచుకున్నాడు.ఒకప్పుడు లవర్ బాయ్ గా నటించిన ఈయన.ఇప్పుడు పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మంచి హోదాలో ఉన్న సమయంలో ఇండస్ట్రీకి దూరమైన సిద్ధార్థ్.

Advertisement
Siddharth Divyansha Kaushik Takkar Movie Review And Rating Details, Takkar Movie

ఎలాగైనా మునుపటి క్రేజ్ సంపాదించుకోవడానికి ఇప్పుడు బాగా ప్రయత్నిస్తున్నాడు.అలా ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాక ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

అంతేకాకుండా సిద్ధార్థకు ఎటువంటి క్రేజ్ అందిందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఇందులో సిద్ధార్థ్ పేద యువకుడి పాత్రలో కనిపిస్తాడు.

ఎలాగైనా డబ్బులు సంపాదించాలన్న తపనతో కనిపిస్తాడు.దీంతో డబ్బు సంపాదించుకొని ధనవంతుడు కావడం కోసం ఆయన ఎంచుకునే మార్గం.

దానివల్ల ఆయన ఎదుర్కొన్న చిక్కులు.చివరికి ఆయన ధనవంతుడు అయ్యాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Siddharth Divyansha Kaushik Takkar Movie Review And Rating Details, Takkar Movie
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

నటినటుల నటన:

సిద్ధార్థ్ నటన విషయానికి వస్తే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.ఒకప్పుడు లవర్ బాయ్ గా కనిపించిన ఆయన ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ అంతంత మాత్రమే కనిపించింది.

Advertisement

దివ్యాన్ష కౌశిక్ నటన కూడా పరవాలేదు అన్నట్లుగా ఉంది.ఇక మిగతా నటీనటులు పాత్రకు తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ విషయానికి వస్తే కార్తీక్ జి క్రిష్ సినిమాపై కాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.ఈ సినిమాతో ఆయన అంతగా సక్సెస్ కాలేనట్లు కనిపించాడు.ఇక నివాస్ కే ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ఆకట్టుకోలేకపోయింది.

ఇక మిగిలిన నిర్మాణ విభాగాలు కూడా అంతంత గానే అనిపించాయి.

విశ్లేషణ:

ఫస్ట్ హాప్ కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉంది.ఇక సెకండ్ హాఫ్ మాత్రం బోరింగ్ అని చెప్పాలి.

అక్కడక్కడ కొన్ని సన్నివేశాల పట్ల దర్శకుడు పొరపాటు చేశాడన్నట్లు కనిపించింది.అంతేకాకుండా సిద్ధార్థ్ పర్ఫామెన్స్ తగ్గినట్లు అనిపించింది.

ప్లస్ పాయింట్స్:

రొమాంటిక్ సీన్స్, యాక్షన్స్ సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్, కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి, సిద్ధార్థ్ నటనలో మరింత ఆసక్తి పెడితే బాగుండేది.మ్యూజిక్.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమాపై అంచనాలు పెట్టుకొని వెళ్తే అంతే సంగతి అని చెప్పాలి.పైగా సిద్ధార్థ్ కు కూడా ఈ సినిమా నిరాశపరిచినట్లు అనిపిస్తుంది.

రేటింగ్: 2.5/5

తాజా వార్తలు