'సలార్' అయిన శృతి రేంజ్ మార్చుతుందా.. అమ్మడి ఆశలన్నీ దీనిమీదే!

లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్( Shruti Haasan ).ఈమెకు ముందు నుండి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది.

అందుకే మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయత్నం చేయాలని అనుకుంది కానీ అలా వర్క్ అవుట్ కాక మళ్ళీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.అయితే ఈమె స్టార్ డాటర్ గా అడుగు పెట్టినప్పటికీ చాలా రోజుల పాటు హిట్ లేక స్ట్రగుల్ అయ్యింది.

మరి ఎట్టకేలకు గబ్బర్ సింగ్( Gabbar Singh )తో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని వెనక్కి తిరిగి చూడలేదు.వరుసగా మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఈమెకు అవకాశాలు ఇవ్వడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీని వీడి మళ్ళీ ఈ మధ్యనే క్రాక్( Krack ) వంటి సూపర్ హిట్ తో మళ్ళీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.

Shruti Haasan Range Change After Salaar, Salaar, Shruti Haasan, Prabhas,tollywoo
Advertisement
Shruti Haasan Range Change After Salaar, Salaar, Shruti Haasan, Prabhas,Tollywoo

అయితే క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి రెండు సూపర్ హిట్స్ అందుకుంది.దీంతో ఈమె డిమాండ్ మరింత పెరిగింది.ఇలా సీనియర్ హీరోలతో నటించిన ఈ అమ్మడు మరో పక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) తో సలార్ సినిమా కూడా చేస్తుంది.

సలార్( Salaar ) తర్వాత ది ఐ అనే ఇంగ్లీష్ సినిమాకు సైన్ చేసింది.సలార్ సినిమా తర్వాత ఈమె టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకోవడం పక్కా అంటున్నారు.

Shruti Haasan Range Change After Salaar, Salaar, Shruti Haasan, Prabhas,tollywoo

శృతి హాసన్ కూడా టాలీవుడ్( Tollywood ) మీద ఎక్కువ ఫోకస్ చేసింది.కెరీర్ పరంగా గ్యాప్ వచ్చిన అది కూడా కవర్ చేసి మళ్ళీ సీనియర్ హీరోలనే తేడా లేకుండా ఒప్పుకోవడం ఈమెకు ప్లస్ అయ్యింది.కెరీర్ రిస్క్ అనే లెక్క చూడకుండా వచ్చిన ప్రతీ ఛాన్స్ చేసుకుంటూ వెళ్తుంది.

సీనియర్ హీరోలు అని చూడకుండా భారీ సినిమాల్లో నటించడం వల్ల శృతికి తెలుగులో డిమాండ్ పెరిగింది.చూడాలి సలార్ తర్వాత ఈమె కెరీర్ ఏ రేంజ్ కు చేరుకుంటుందో.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు