శృతిహాసన్ కొత్త అవతారం

శృతి హాసన్ అంటే, నటనతో పాటు, తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ గుర్తుకు వస్తుంది మనకు.

ఈనాడు సినిమాకు తన బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ కూడా ఇచ్చింది.

తెర వెనుక రకరకాల పాత్రల్లో కనిపించే శృతికి తెర మీద మాత్రం కొత్తరకమైన పాత్రలు పెద్దగా రాలేదు, ఒక్క బాలివుడ్ మూవి డీ-డే లోని వేశ్య పాత్ర తప్ప.కాని ఇక శృతి బాధపడాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే తనకు పూర్తిగా కొత్తగా ఉండే పాత్ర చేయబోతోంది.సూర్య సింగం-3 లో అనుష్కతో పాటు శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఇక్కడ విశేషమేమంటే, శృతి పోషించబోయేది పోలీస్ పాత్ర.అవును, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా శృతి సూర్యతో పోటిపడనుంది.

Advertisement

హరి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ఈ నెలలో విశాఖపట్నం లో మొదలుపెట్టాలనుకున్నారు.కాని చెన్నై వరదల కారణంగా కొన్ని రోజులపాటు వాయిదా వేసారు.

హారీస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తారు.

Advertisement