సంక్రాంతి పండుగ రోజు ఈ పనులను అసలు చేయకూడదా.. ఒకవేళ చేస్తే..

సంక్రాంతి పండుగను మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రజలు వారి కుటుంబ సభ్యులతో ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటారు.

జీవన ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారు కూడా సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వస్తారు.

చిన్నచిన్న కుటుంబాలుగా విడిపోయిన ఈ పండుగను మాత్రం ఉమ్మడిగా చేసుకునే వారు చాలామంది ఉన్నారు.రంగురంగుల ముగ్గులు గాలిలో ఎగిరే పతంగులు, గుమగుమలాడే పిండి వంటలతో పాటు కొన్ని ప్రాంతాలలో కోడిపందాలతో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటారు.

అయితే ఈ పండుగ ఎంత సరదాగా గడుస్తుందో అంతకంటే పవిత్రమైన పనులు చేయవలసినవి ఎన్నో ఉన్నాయి.తల స్నానం సూర్యదేవుని పూజలు, దానధర్మాలు కచ్చితంగా చేయవలసి ఉంటుంది.

వీటితోపాటు పండగ రోజు చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మకర సంక్రాంతి రోజున తల స్నానం చేశాకే ఆహారపనియాలు తీసుకోవడం మంచిది.మర్చిపోయి కూడా తల స్నానం చేయకుండా ఏదీ తినకూడదు.ఈ పండుగ రోజున మందు అస్సలు తాగకూడదు.

మాంసాహారం తినడం వంటివి చేయకూడదు.తల స్నానం చేసిన తర్వాత నిల్వ ఉంచిన ఆహారాన్ని మకర సంక్రాంతి రోజున అస్సలు తినకూడదు.

ఈ చేయకూడని పనులు చేయడం వల్ల మీ పై ప్రతికూల శక్తుల ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది.ఈరోజున కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.

అంతేకాకుండా మకర సంక్రాంతి లాంటి పవిత్రమైన రోజులలో ఎవరితోనూ అనవసరంగా గొడవకు దిగకుండా ఉండాలి.ఎవరైనా కావాలని రెచ్చగొట్టిన కోపాన్ని అదుపు చేసుకోవడం మంచిది.అనవసరంగా కోపం తెచ్చుకొని గొడవలకు, ఘర్షణలకు దిగితే మీపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

దీనివల్ల మీ ఎదుగుదలకు అడ్డంకులు ఏర్పడతాయి.అందుకని సంబరాలు చేసుకునే సంక్రాంతి రోజు ఇలాంటి గొడవలకు దిగకుండా సంతోషంగా గడపడం మంచిది.

Advertisement

ఎవరితోనూ చెడుగా అసలు మాట్లాడకూడదు.వీలైనంత మేరకు ఎంతో ప్రశాంతంగా ఉండండి.

ఇలా సంక్రాంతి రోజు కొన్ని చేయకూడని పనులకు దూరంగా ఉండి శాస్త్రం ప్రకారం చేయాల్సిన మంచి పనులు చేస్తే మీకు ఎంతో శుభం కలుగుతుందని ధార్మిక పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు