ఈసారి మోడీకి గట్టి పోటీ తప్పదా ?

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడే కొద్ది పోలిటికల్ హీట్ రెట్టింపవుతోంది.మరో మూడు లేదా నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.

దీంతో ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరు ? దేశ ప్రజలు మళ్ళీ బీజేపీ( BJP ) కె పట్టం కడతారా ? అధికార మార్పు కోరుకుంటారా ? అనే ప్రశ్నలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.2014 నుంచి దేశంలో మోడీ మేనియా కొనసాగుతోంది.2014 లోనూ 2018 లోనూ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ( Narendra Modi )నే అనే సంగతి అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.

Should Modi Compete With Rahul Gandhi, Narendra Modi, Congress , Bjp , Politics

అయితే గత పదేళ్ళ కాలంగా మోడీ పాలన చూసిన ప్రజలు.ఈసారి అధికార మార్పు కోరుకునే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.గతంలో మోడీకి ధీటైన ప్రత్యర్థి కొరత విపక్ష పార్టీలను గట్టిగానే వేధించేది.

కానీ 2018 ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ తనను తాను మలచుకుంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ వచ్చారు.ముఖ్యంగా ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన లభించింది.

ప్రజలతో కలవడంలోనూ, పదునైన వ్యాఖ్యలు చేయడంలోనూ రాహుల్ గాంధీ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చారు.ఆ ప్రభావం ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

Advertisement
Should Modi Compete With Rahul Gandhi, Narendra Modi, CONGRESS , Bjp , Politics

కర్నాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ రాహుల్ గాంధీ ప్రచారాలే అనేది కొందరి అభిప్రాయం.

Should Modi Compete With Rahul Gandhi, Narendra Modi, Congress , Bjp , Politics

ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నుంచి మోడీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.బీజేపీ తరుపున నరేంధ్ర మోడీ, అమిత్ షా మినహా మిగిలిన నేతలంతా పెద్దగా ప్రభావం చూపడం లేదు.కానీ ఈసారి కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ), మల్లికార్జున్ ఖర్గే వంటి వారు విస్తృతంగా ప్రజల్లో ప్రచారాలు నిరవహిస్తూ కాంగ్రెస్ కు మంచి మైలేజ్ తెస్తున్నారు.

అందువల్ల 2024 ఎన్నికలు హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి ఇన్నాళ్ళు మోడీ మేనియాతో నెట్టుకొచ్చిన బీజేపీకి ఈసారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ రూపంలో గట్టి పోటీ తప్పెలా లేదు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు