షాకింగ్ వీడియో: నీటిలో కొట్టుకుపోతున్న బాలుడుని కాపాడిన వ్యక్తులు..

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ (Srinagar)ప్రాంతంలో సఫాకడల్‌లో కొట్టుకుపోతున్న ఇద్దరు స్థానికులు వారి ప్రాణాలను లెక్క చేయకుండా పిల్లాడి ప్రాణాలను కాపాడారు.

అక్కడి స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.

ఆదివారం మధ్యాహ్న సమయంలో జీలం నదిలో (river Jhelum) ఏడు సంవత్సరాలు ఉన్న బాలుడు నీటిలో కొట్టుకుపోతూ ఉన్న విషయాన్ని ఇద్దరు వ్యక్తులు గుర్తించారు. జోహర్ అహమ్మద్, షోహన్ అహ్మద్(Zohar Ahmed, Shohan Ahmed) అనే ఇద్దరు వ్యక్తుల వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెంటనే జీలం నదిలోకి దిగి బాలుడి ప్రాణాలను కాపాడారు.

నీటిలో కొట్టుకుపోతున్న ఆ బాలడును గమనించిన ఇద్దరు వెంటనే అప్రమత్తమయి నీటిలోకి దిగి బాలుడని ముందుగా ఒడ్డుకు చేర్చారు.

ఆ తర్వాత ఆ అబ్బాయిని ఒడ్డుకు చేర్చిన తర్వాత సిపిఆర్(cpr) చేసి చిన్నారిని బ్రతికించారు.ఆ తర్వాత దగ్గరలోని ఆసుపత్రికి బాలుడును తరలించారు.ఇక అబ్బాయిని కాపాడిన వ్యక్తులు మాట్లాడుతూ.

Advertisement

తాము మొదట ఆ అబ్బాయి చనిపోయాడని భావించమని.కానీ.

, కొన్ని నిమిషాల పాటు సిపిఆర్ చేసిన తర్వాత తాము అతన్ని సజీవంగా బతికేందుకు తోడ్పడినట్లు తెలిపారు.ఆ తర్వాత ఎలాంటి సమయం వృధా చేయకుండా వెంటనే తాము అతన్ని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

ఆ తర్వాత అక్కడ వైద్యులు అబ్బాయికి సరైన వైద్యం చేసి కాపాడారంటూ వారు తెలిపారు.

ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలుడిని కాపాడిన ఆ ఇద్దరిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఈ వీడియో చూసిన మినార్ పిల్లలను నీటి వనరుల దగ్గరికి తీసుకుపోవద్దని.ఇలా జరిగితే చాలా ప్రమాదకరమని కొందరు కామెంట్ చేస్తున్నారు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

చాలామంది ఈ రియల్ హీరోస్ ని ప్రశంసిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు