అన్ స్టాపబుల్ సీజన్3 కు ఈ నలుగురు హీరోలు హాజరవుతారా.. బాలయ్య ఆహ్వానిస్తారా?

స్టార్ హీరో బాలకృష్ణ( Balakrishna ) ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకు( Unstoppable With NBK ) హోస్ట్ గా వ్యవహరిస్తారని ప్రకటన వచ్చిన సమయంలో ఎక్కువమంది బాలయ్యతో టాక్ షో అంటే రిస్క్ అని కామెంట్లు చేశారు.

అయితే బాలయ్య మాత్రం ప్రేక్షకుల్లో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేయడంతో పాటు ఈ షో ద్వారా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

ఫస్ట్ సీజన్ తో పాటు సెకండ్ సీజన్ ను కూడా బాలయ్య తన హోస్టింగ్ తో సక్సెస్ చేశారు.అయితే ఈ షో సీజన్1 కు, సీజన్2 కు హజరు కాని సెలబ్రిటీల జాబితా ఎక్కువగానే ఉంది.

వారిలో ముఖ్యం సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి, నాగార్జున యంగ్ జనరేషన్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారు.హీరోయిన్లలో సమంత ఈ షోకు హాజరైతే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య ఆహ్వానిస్తే ఈ షోకు రావడానికి ఎవరూ నో చెప్పరనే సంగతి తెలిసిందే.

Advertisement

బాలయ్య నాగార్జున మధ్య సత్సంబంధాలు లేవని ప్రచారం జరుగుతున్నా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టత ఇచ్చారు.అదే సమయంలో గత కొన్నేళ్లుగా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్( Jr Ntr ) ఒకే వేదికపై కనిపించలేదనే సంగతి తెలిసిందే.బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ కలిసి కనిపించే రోజు కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చరణ్, చిరంజీవి( Ram Charan Chiranjeevi ) ఈ షో విషయంలో పాజిటివ్ గా ఉన్నారు.

రాబోయే రోజుల్లో అన్ స్టాపబుల్ షో సీజన్3 కు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.ఆహా ఓటీటీ నిర్వాహకులు బాలయ్యకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.బాలయ్య ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు