రాజ్ తరుణ్ లవర్ లావణ్య ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్టులు.. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుందా?

రాజ్ తరుణ్ - లావణ్య( Raj Tarun - Lavanya ).

గత కొద్ది రోజులుగా ఈ రెండు పేర్లు సోషల్ మీడియాలో మారు మోగుతున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి.విషయం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కూడా కనబడడం లేదు.

ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.అందులో భాగంగానే తాజాగా రాజ్ తరుణ్ తనకు కావాలంటూ పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన లావణ్య, నిన్న రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.

పోలీసులు వెంటనే స్పందించి లావణ్య ఇంటికి వెళ్లారు.ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Advertisement

ఓవైపు కేసు నడుస్తుండగా, మరోవైపు లావణ్య సూసైడ్( Lavanya suicide ) కు ప్రయత్నించడం సంచలనంగా మారింది.తాజాగా దీనిపై ఆమె స్పందించింది.రాజ్ తరుణ్ తనకు దక్కడనే భయంతోనే ఆత్మహత్యకు యత్నించినట్టు వెల్లడించింది లావణ్య.

ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ( Raj Tarun, Malvi Malhotra )హీరోహీరోయిన్ అయినంత మాత్రాన స్పెషల్ ట్రీట్ మెంట్ ఉంటుందా? వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.మాల్వీ మల్హోత్రాకు పోలీసులు కనీసం కాల్ కూడా చేయలేదు, ఎందుకు? వాళ్లు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారనిపించింది.నాకు న్యాయం జరగడం లేదనిపించింది.

రాజ్ తరుణ్ నాకు దక్కడు అనిపించింది.అందుకే ఆత్మహత్యకు యత్నించాను అని తెలిపింది లావణ్య.

ఈ కేసును నీరుగార్చడానికి రాజ్ తరుణ్ ప్రయత్నించకపోయినా, అతడి పక్కనుండే వ్యక్తులు ప్రయత్నిస్తారంటూ ఆరోపించింది లావణ్య.అవసరమైతే రాజ్ తరుణ్ హైకోర్టుకు వెళ్లి, తనను అరెస్ట్ చేయకుండా వారెంట్ తెచ్చుకుంటాడనే అనుమానాన్ని వ్యక్తం ఆమె చేసింది.అలాగే రాజ్ తరుణ్ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

అతడు రాజ్ తరుణ్ కు మాత్రమే మేనేజరా లేక ఇతర ప్రముఖ హీరోలకు కూడా మేనేజరా అనే విషయం నాకు తెలియదు.కేసును తప్పుదోవ పట్టించడానికి రాజ్ ప్రయత్నించకపోయినా, ఆయన పక్కనున్న వాళ్లు ప్రయత్నిస్తారు కదా.నాకు మాత్రం కాల్స్ వస్తున్నాయి.కేసును వెనక్కు తీసుకుంటే 5 కోట్లు ఇస్తామంటున్నారు.

Advertisement

వెనక్కు తీసుకోకపోతే నరకం చూపిస్తామంటున్నారు.పెద్దవాళ్లతో పెట్టుకోవద్దంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు అని ఆమె ఆరోపించింది.

తాజా వార్తలు