మహేష్ బాబు ఇచ్చిన షాక్ తో త్రివిక్రమ్ మారారా.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

సినిమా ఇండస్ట్రీలో దర్శకులు సక్సెస్ లో ఉన్న సమయంలో ఏం చేసినా చెల్లుతుంది.కొంతమంది దర్శకులు తాము తీసిందే రైట్ అని భావిస్తూ ఉంటారు.

ఇతరులు తమ సినిమాలకు సంబంధించి ఏవైనా సలహాలు ఇచ్చినా ఆ సలహాలను పట్టించుకోవడానికి ఇష్టపడరు.మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో సినిమాలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు.

అయితే ఆ తర్వాత వేర్వేరు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కాల్సిన ఒక సినిమా ఆగిపోయింది.ఈ సినిమా ఆగిపోవడంతో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా సెట్ అయింది.

పూజా హెగ్డే హీరోయిన్ గా ఫైనల్ కాగా ఒక యాక్షన్ సన్నివేశాన్ని కూడా షూట్ చేశారు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ చెప్పిన కథ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదని కామెంట్లు వినిపించాయి.

Advertisement

మహేష్ కుటుంబంలో చోటు చేసుకున్న వరుస విషాదాలు కూడా ఈ సినిమా మరింత ఆలస్యం కావడానికి ఒక విధంగా కారణమయ్యాయి.అదే సమయంలో త్రివిక్రమ్ ను కథ మార్చాలని మహేష్ కోరగా మరో కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు.

అయితే త్రివిక్రమ్ అప్పటికప్పుడు సీన్లు రాస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉండగా మహేష్ వల్ల త్రివిక్రమ్ ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ పూర్తి చేశారని బోగట్టా.మహేష్ బాబు ఇచ్చిన షాకుల వల్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ మారారని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు