టాప్‌లేపిన ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ టైటిల్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో సినిమా అంటే టాలీవుడ్ వెండితెర షేర్ అవ్వాల్సిందే.

వీరి కాంబినేష‌న్‌లో 2008లో వ‌చ్చిన జ‌ల్సా అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌.

జ‌ల్సాతో ప‌వ‌న్‌ను త్రివిక్ర‌మ్ చాలా వైవిధ్యంగా చూపించాడు.ఇక 2013లో వ‌చ్చిన అత్తారింటికి దారేది సినిమాలో ప‌వ‌న్‌ను స్టైలీష్ ప‌వ‌న్‌గా ప్ర‌జెంట్ చేసిన త్రివిక్ర‌మ్ ప‌వ‌న్‌కు కేరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు.

వాస్త‌వంగా చూస్తే అత్తారింటికి దారేది త‌ర్వాత ప‌వ‌న్‌కు హిట్ లేదు.గోపాల‌…గోపాల యావ‌రేజ్.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు రూపంలో ప‌వ‌ర్ రెండు వ‌రుస డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్నాడు.కాట‌మ‌రాయుడు తొలి రోజే తేలిపోవ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆశ‌ల‌న్నీ అడియాస‌ల‌య్యాయి.

Advertisement

ఇక ఇప్పుడు ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన ఫ్యాన్స్ అంద‌రూ ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ మూవీ మీద చాలా ఆశ‌లే పెంచుకున్నారు.భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా గురించి ఓ షాకింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమాకు ” ఇంజ‌నీర్ బాబు ” టైటిల్ అయితే ట్యాగ్‌లైన్‌గా ” ఇంటి పేరు – ఒంటి పేరు అంతా ఇదే ” అని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.ప‌వ‌న్ క్యారెక్ట‌ర్ ఈ సినిమాలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ అట‌.అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.ప‌వ‌న్ కేరీర్‌లో 25వ ల్యాండ్‌మార్క్ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.మొత్తానికి టైటిల్‌తోనే యూత్‌కు కిక్ ఇస్తోన్న త్రివిక్ర‌మ్ మ‌రోసారి మ్యాజిక్ రిపీట్ చేయ‌డం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది.

Roja Bet Review And Player Reputation (UK)
Advertisement