ఆలయంలో టెంపుల్ రన్ ఆడిన టూరిస్ట్స్‌.. వీడియో చూస్తే షాకే..?

కంబోడియాలోని ప్రముఖ "అంగ్కోర్ వాట్"( Angkor Wat ) దేవాలయం ప్రస్తుతం ఒక కొత్త సమస్యను ఫేస్ చేస్తోంది.

ఈ దేవాలయాన్ని సందర్శించే చాలామంది పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ ఒక "టెంపుల్ రన్" గేమ్( "Temple Run" game ) ఆడుతున్నారు.

ఇది చాలా సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్లలో సూపర్ పాపులర్ అయింది.ఈ ఆటలో ఒక వ్యక్తి అడవి ద్వారా పరుగులు తీస్తూ, అడ్డంకులను దాటి పోవాలి.

ఇప్పుడు పర్యాటకులు ఈ ఆటను ఇమిటేట్ చేస్తూ దేవాలయం చుట్టూ పరుగులు తీస్తున్నారు.దీని వల్ల చరిత్రకారులు, దేవాలయాన్ని కాపాడాలని కోరుకునే వారు చాలా ఆందోళన చెందుతున్నారు.

అంగ్కోర్ వాట్ దేవాలయం చాలా పాతది.చారిత్రక ప్రాముఖ్యత కలిగినది.

Advertisement

ఇది హిందూ, బౌద్ధ మతాలకు( Hinduism and Buddhism ) సంబంధించినది.అలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు అని వారు అంటున్నారు.

టిక్‌టాక్, ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలామంది వ్యక్తులు అంగ్కోర్ వాట్ వంటి పాత దేవాలయాలను నాశనం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.వీళ్లు ఒక ప్రముఖ మొబైల్ గేమ్ అయిన "టెంపుల్ రన్" ఆడుతున్నట్లుగా వీడియోలు తీసుకుంటున్నారు.ఈ గేమ్‌లో భాగంగా టూరిస్టులు దేవాలయాల చుట్టూ పరుగులు తీసి, దూకడం వంటివి చేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ వీడియోలకు చాలా మంది లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు.కొన్ని వీడియోలను రెండు మిలియన్ల మందికి పైగా చూశారు.

ఇలాంటి చర్యల వల్ల దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నిర్మాణాలు చాలా తీవ్రంగా దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ పవిత్రమైన ప్రదేశాలను అవమానించడమే అవుతుందని అంటున్నారు, వైరల్ కంటెంట్ కోసం పరుగులు ఇస్తున్నారు కానీ ఇది చరితాత్మక కట్టడానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని అంటున్నారు.రోజూ కొత్త వీడియోలు వస్తున్నాయి, దీంతో ఈ ధోరణి మరింత పెరుగుతోంది.

ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?
Advertisement

తాజా వార్తలు