ప్రొఫెసర్ జి. సాయి బాబాకు సుప్రీంకోర్టులో షాక్

ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ తీర్పును సుప్రీం న్యాయస్థానం సస్పెండ్ చేసింది.

సాయిబాబా పై మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదని చెప్పింది.ఈ క్రమంలోనే సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిందని వ్యాఖ్యానించింది.

సాయిబాబా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తిని సుప్రీం నిరాకరించింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని వెల్లడించింది.

ఈ క్రమంలోనే నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సాయిబాబాకు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణ డిసెంబర్ 8 కి వాయిదా వేసింది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు