గూగుల్ క్రోమ్ వాడేవారికి షాక్.. వాటిని వెంటనే డిలీట్ చేయండి

ఇంటర్నెట్ గురించి అవగాహన ఉన్న ప్రతిఒక్కరూ గూగుల్ క్రోమ్( Google Chrome ) ఉపయోగిస్తూ ఉంటారు.ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలన్నా.

లేదా ఆన్‌లైన్ లో ఏవైవా సేవలు పొందాలన్నా గూగుల్ క్రోమ్ అనేది తప్పనిసరిగా కావాలి.ఇంటర్నెట్‌లో తెలియని విషయం గురించి ఏదైనా తెలుసుకోవాలన్నా గూగుల్ క్రోమ్‌లోకి వెళ్లి సెర్చ్ చేస్తే వెంటనే సమాచారం వస్తుంది.

అంతగా గూగుల్ క్రోమ్ అనేది ఇంటర్నెట్ వాడే ప్రతిఒక్కరికీ అవసరమే.

అయితే తాజాగా వినియోగదారులకు గూగుల్ క్రోమ్ షాకిచ్చింది.ఎక్స్‌టెన్షన్‌ని డిలీట్ చేయాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.చాలామంది గూగుల్ క్రోమ్‌లో ఎక్స్‌టెన్షన్ వాడుతూ ఉంటారు.

Advertisement

అయితే ఎక్స్‌టెన్షన్స్ వాడటం అనేది ప్రమాదకరమని, సైబర్ దాడులు( Cyber ​​attacks ) జరిగే అవకాశముందని సూచిస్తున్నారు.దీంతో గూగుల్ ఎక్స్‌టెన్షన్ ఉంటే వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నారు.

గూగుల్ ఎక్స్‌టెన్షన్స్( Google Extensions ) వాడటం వల్ల సెర్చింగ్ సామర్థ్యం అనేది పెరుగుతుంది.వెబ్ బ్రౌజర్( Web browser ) పనితీరును ఎక్స్‌టెన్షన్స్ మరింత పెంచుతాయి.

అయితే కొన్ని ప్రమాదకర ఎక్స్‌టెన్షన్స్‌ను యాంటీ వైరస్ సంస్థ అవాస్ట్ గుర్తించింది.

క్రోమ్ వెబ్‌స్టోర్‌లో ప్రమాదకర ఎక్స్‌టెన్షన్స్ 32 వరకు ఉన్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు.ప్రపంచవ్యాప్తంగా 7.5 కోట్ల మంది ఈ ఎక్స్‌టెన్షన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు గుర్తించారు.వీటిని వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరించారు.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!

ఎక్స్‌టెన్షన్స్‌లో దాగి ఉన్న ప్రమాదకర కోడ్ వల్ల ముప్పు ఉంటుందని, వీటి వల్ల సెర్చ్ రిజల్ట్స్ తారుమారు కావడం, పెయిడ్ యాడ్స్, స్పాన్సర్డ్ లింక్స్, డేంజరస్ లింక్స్ ను పంపించడం లాంటివి చేస్తాయని చెబుతున్నారు.అయితే ఇలాంటి ప్రమాదకర ఎక్స్‌టెన్షన్స్‌ని గూగుల్ ఎప్పటికప్పుడు తొలగిస్తోంది.

Advertisement

ఇప్పటివరకు సుమారు 50 ప్రమాదకర ఎక్స్‌టెన్షన్స్‌ని క్రోమ్ వెబ్ స్టోర్ నుంచి తొలగించారు.ఇలాంటి ప్రమాదకర ఎక్స్‌టెన్షన్స్ పట్ల యూజర్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

తాజా వార్తలు