Shobha Shetty: ఆ నటుడుతో లవ్ లో ఉన్న శోభ శెట్టి.. స్టోరీతో నిజాన్ని బయట పెట్టేసిందిగా?

అప్పుడప్పుడు నటినటులు వాళ్ళు ఇచ్చే హింట్ ల వల్ల వాళ్ళ రహస్యాలు బయటపడుతుంటాయి.

ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి లాంటి విషయాలలో ఇటువంటివి బాగా లీక్ అవుతూ ఉంటాయి.

అయితే తాజాగా బుల్లితెర నటి శోభ శెట్టి( Shobha Shetty ) పెట్టిన పోస్ట్ పట్ల కూడా ఆమె ప్రేమలో ఉందని అనుమానాలు వస్తున్నాయి.ఇంతకు ఆమె ఎవరితో ప్రేమలో ఉందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

బుల్లితెరపై ప్రసారమైన కార్తీకదీపం సీరియల్( Karthikadeepam Serial ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు మోనిత పాత్రతో( Monitha ) పరిచయమైంది శోభశెట్టి.ఈమె కన్నడకు చెందింది.

తొలిసారిగా శోభ శెట్టి కన్నడ, తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా అడుగు పెట్టింది.ఏ సీరియల్ కు అందుకోనంత గుర్తింపు కార్తీకదీపం తోనే అందుకుంది శోభ.పైగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

Advertisement
Shobha Shetty Is In Love With Karthikadeepam Serial Actor Yashwanth-Shobha Shet

సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.

అందులో తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.కార్తీక దీపం సెట్ లో చాలా వీడియోలను తీసి అభిమానులకు పంచుకుంది.

ఇక గత ఏడాది ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించగా ఆ సీరీస్ బాగా ఆకట్టుకుంది.

Shobha Shetty Is In Love With Karthikadeepam Serial Actor Yashwanth

ఇన్ స్టా లో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ట్రెడిషనల్ దుస్తువులు ధరించి వాటి ద్వారా ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా షేర్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇక కార్తీకదీపం సీరియల్ ముగిసినప్పటికీ కూడా ఈమె అభిమానులు ఈమెను మోనిత అని పిలుస్తూనే ఉన్నారు.ప్రస్తుతం ఈమె పలు సీరియల్స్ లో బిజీగా ఉంది.అంతేకాకుండా కొన్ని వీడియో సాంగ్స్ కూడా చేస్తూ ఉంది.

Advertisement

అలా నిత్యం బిజీ లైఫ్ తో గడుపుతూ ముందుకు సాగుతుంది.రీసెంట్ గా బ్యూటీ పార్లర్ కి సంబంధించిన క్లాసెస్ కూడా పెట్టింది.

అయితే ఇదంతా పక్కన పెడితే తనతో కలిసి కార్తీకదీపం సీరియల్ లో నటించిన నటుడు యశ్వంత్( Yashwanth ) అందరికీ గుర్తుండొచ్చని చెప్పాలి.

ఆ సీరియల్ లో అతడు మోనిత ప్రేమించిన వ్యక్తికి తమ్ముడిగా నటించాడు.అయితే మోనిత కార్తీకదీపం సీరియల్ అప్పటినుంచి ఇతడితో బాగా క్లోజ్ గా కనిపిస్తూ ఉంటుంది.అతనితో కలిసి వీడియోస్ కూడా చేసింది.

అంతేకాకుండా అతని హోమ్ టూర్ కూడా చేసి చూపించింది.అయితే ఆమె అతడితో అంతా క్లోజ్ గా ఉండటంతో వీరి మధ్య లవ్ నడుస్తుంది అని చాలామంది అనుమానపడ్డారు.

అయితే ఆమధ్య తన తల్లి ఒక సంబంధం తీసుకొచ్చిందని చెప్పడంతో ఈమెకు, యశ్వంత్ కు మధ్య ఎటువంటి లవ్ లేదేమో అని అభిప్రాయపడ్డారు.కానీ తాజాగా తను పంచుకున్న స్టోరీని చూసినట్లయితే వీరిద్దరూ మధ్య ఏదో నడుస్తుంది అని అనుకుంటున్నారు జనాలు.ఆ స్టోరీలో తను అతడికి బర్త్డే విషెస్ చేస్తూ నా లైఫ్ లోకి సంతోషాన్ని తీసుకొచ్చినందుకు థాంక్స్ అని చెబుతూ.

అంతేకాకుండా తన జీవితంలో ముఖ్యమైన పర్సన్ అంటూ పంచుకోవడంతో ఆమె ఇతడితో లవ్ లో ఉందని జనాలు కన్ఫామ్ చేసుకుంటున్నారు.మరి ఈ విషయం గురించి శోభ ఏమని స్పందిస్తుందో చూడాలి.

తాజా వార్తలు