మెగా బ్రదర్‌పై 'మా' మాజీ అధ్యక్షుడు సంచలన కామెంట్స్‌.. రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్నాడు

ఈమద్య కాలంలో మెగా బ్రదర్‌ నాగబాబు తెగ వార్తల్లో నిలుస్తున్నాడు.

తన యూట్యూబ్‌ ఛానెల్‌లో రాజకీయాలపై పంచ్‌లు వేస్తూ విభిన్నమైన వీడియోలు చేస్తూ తనదైన శైలిలో అందరిని నవ్విస్తున్నాడు.

ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో నరేష్‌ ప్యానెల్‌కు నాగబాబు బహిరంగంగానే మద్దతు తెలిపిన విషయం తెల్సిందే.నాగబాబు మద్దతు నరేష్‌ ప్యానల్‌కు దక్కడంతో మెగా మద్దతు నరేష్‌ ప్యానల్‌కే ఉందని అంతా భావించి తమ ఓట్లను నరేష్‌ ప్యానల్‌కు వేయడం జరిగింది.

మెగా మద్దతుతో నరేష్‌ ప్యానల్‌ సునాయాసంగా గెలుపొందింది.తన ఓటమికి ప్రధాన కారణం నాగబాబు అంటూ మా తాజా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.

నేను నాగబాబు వల్లే ఓడిపోయాను.నాకు ఆయన ఇచ్చిన గిఫ్ట్‌కు ఖచ్చితంగా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాను అంటూ ప్రకటించాడు.

Advertisement

అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.త్వరలోనే గిఫ్ట్‌ ఉంటుందని నాగబాబును ఉద్దేశించి శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

ఇండస్ట్రీకే పెద్ద దిక్కు అయిన చిరంజీవి తమ్ముడిని మరీ ఇంతగా హెచ్చరించడంతో శివాజీ రాజా ఏం చేయబోతున్నాడా అంటూ అంతా ఆశ్చర్య పోతున్నారు.

నాగబాబు మా ఎన్నికల్లో నరేష్‌ ప్యానల్‌కు మద్దతు ఇవ్వడం వెనుక కారణం ఉంది, అదే శ్రీరెడ్డి.ఆమద్య తన తల్లిని శ్రీరెడ్డి దారుణమైన పదజాలంతో దూషించినా కూడా మా అధ్యక్షుడు శివాజీ రాజా పట్టించుకోలేదని, అందుకే ఇప్పుడు శివాజీ రాజాకు తాను మద్దతు ఇవ్వాలనుకోవడం లేదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు.దాంతో శివాజీ రాజా ఓటమి పాలయ్యాడని అంతా భావిస్తున్నారు.