Sivajiganesan : శివాజీ గణేశన్ ఆ పాత్రని ఎన్‌టి‌ఆర్, దిలీప్ కుమార్ కంటే కూడా బాగా చేశాడట?

సగటు ఓ సినిమా ప్రేమికుడికి , అదే విధంగా ఇతర భాషా సినిమాలు ఎక్కువగా చూడడం అలవాటు వున్నవారికి “తంగపతక్కమ్”( Thangapatakkam ) అనే సినిమా గురించి తెలిసే వుంటుంది.

ఈ క‌థ‌ సింపుల్ గా సింగల్ లైన్లో చెప్పాలంటే ఓ కొడుకును చంపిన తండ్రి క‌థ‌.

“అయితే దీనిని కేవలం కొడుకును చంపిన తండ్రి క‌థ‌లాగా మాత్ర‌మే చూడకూడదు, ఓ ప్ర‌భుత్వోద్యోగిలో ఉండాల్సిన నిబ‌ద్ద‌త‌ను బ‌లంగా చెప్పిన క‌థ‌”గా చూడండి అని శివాజీగ‌ణేశ‌న్( Sivajiganesan ) తరచూ చెప్పేవారట.మన తెలుగు సంగతి పెరుమాళ్లకెరుకగాని, త‌మిళ‌ సినిమా నాట‌కాన్ని మింగేయ‌లేదు.

సినిమా న‌టులు ఆ మాట‌కొస్తే సినిమాల్లో సూప‌రు స్టార్లుగా వెలుగుతున్న వారు సైతం స్టేజ్ మీద‌కు రావ‌డానికి అక్కడ వెనుకాడేవారు కాదు.

Shivaji Ganeshan Unbelivable Performace Of Thangavakkam

అక్కినేని ( Akkineni )గురించి ఆత్రేయ ఒక వ్యాసంలో రాస్తూ.ఈ విష‌యాన్ని గుచ్చి మ‌రీ చెప్పారు.నాగేశ్వ‌ర్రావు న‌ట సామ్రాట్ అవ‌డం వెనుక కొద్ది మేర అయినా నాట‌క ప్ర‌మేయం ఉంది అని అన్నారు.

Advertisement
Shivaji Ganeshan Unbelivable Performace Of Thangavakkam-Sivajiganesan : శి�

అదేవిధంగా నాట‌కాన్ని సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల నాగేశ్వ‌ర్రావు ఎదుగుద‌ల కూడా ఆగిపోయింది అంటూ రాసుకొచ్చారు.ఎందుకంటే నాట‌కాన్ని చంపేయ‌డం వ‌ల్ల మ‌రో నాగేశ్వ‌ర్రావు రావ‌డానికి ఆస్కారం లేకుండా పోయింది అని చెప్పారు ఆత్రేయ‌.

ఇకపోతే శివాజీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌చ్చిన తంగపతక్కమ్ సినిమా స్టేజ్ మీద పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న క‌థే.త‌మిళ రాజ‌కీయాల్లోనూ, నాట‌కాల్లోనూ, సినిమాల్లోనూ క్రియాశీల‌కంగా ఉన్న న‌టుడు సెందామ‌రై( Actor Sendamarai ) రెగ్యుల‌ర్ గా వేస్తున్న తంగ‌ప‌త‌కం నాట‌కాన్ని శివాజీ మిత్రుడొక‌రు చూసి బాగుంద‌ని మెచ్చుకున్నారు.

Shivaji Ganeshan Unbelivable Performace Of Thangavakkam

ఆ తరువాత శివాజీకి దానిమీద ఇంట్ర‌స్టు పుట్టి స్వ‌యంగా వెళ్లి ఆ నాట‌కం చూసి మైమరచిపోయారట.ఆ నాట‌క ర‌చ‌యిత జె.మ‌హేంద్ర‌న్( J.Mahendran ).త‌ర్వాత రోజుల్లో అద్భుత‌మైన సినిమాలు తీసి త‌మిళ నాట కొత్త త‌ర‌హా సినిమాలు తీసిన ద‌ర్శ‌కుల లిస్టులో చేరిపోయారాయన.మ‌హేంద్ర‌న్ అంటే తెలుగులో సుహాసినీ మోహ‌న్ ల‌తో “మౌన‌గీతం” అనే డ‌బ్బింగు సినిమా వచ్చింది గుర్తుందా? ఆ సినిమా దర్శకుడే ఆయన.ఆ సినిమా మన తెలుగునాట కూడా మంచి హిట్ అయింది.ఇక అసలు విషయంలోకి వెళితే, స్టేజ్ మీదే కాదు వెండితెర మీద కూడా తంగపతక్కమ్ విజయ పతకాన్ని ఎగరవేసింది.

ఇదే సినిమాను ఆధారం చేసుకుని హిందీలో అమితాబ్, దిలీప్ కుమారుల‌తో( Dileep kumar ) శ‌క్తి సినిమా తీయగా సూపర్ డూపర్ హిట్ అయింది.తెలుగులో ఎన్టీఆర్ , మోహ‌న్ బాబుల‌తో కొండ‌వీటి సింహం తీయగా సూపర్ డూపర్ హిట్.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఇక మన తెలుగు ప్రేక్ష‌కుల గురించి తెలిసిందే.అల్లు అర‌వింద్ త‌మిళ తంగ‌ప‌త‌కం సినిమా హ‌క్కులు కొని తెలుగులో బంగారుప‌త‌కం అని డ‌బ్ చేసి విడుద‌ల చేస్తే వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది.

Advertisement

ఇకపోతే ఎన్టీఆర్‌, దిలీప్ కుమారుల‌క‌న్నా శివాజీయే ఆ పాత్ర‌కు ఎక్కువ న్యాయం చేశారు అనిచెప్పుకోవాలి.అంతకు మించి దాన్ని శివాజీ తంగపతక్కమ్ అనే అనాలి.

ఎందుకంటే అదే నాటకాన్ని ఆయన ఆ తరువాతి రోజుల్లో స్టేజిపైన లైవ్ లో ఇరగదీశారు మరి.

తాజా వార్తలు