టీ అమ్ముతూ 5 రూపాయల భోజనం తింటూ ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

తెలంగాణ డీఎస్సీ పరీక్ష ఫలితాలు( Telangana DSC Exam Results ) తాజాగా వెలువడగా ఎంతోమంది పేదింటి బిడ్డలు మంచి ఫలితాలను సాధించడం గమనార్హం.

పేదింటి బిడ్డలు తమ ప్రతిభను చాటుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ఒకవైపు టీ అమ్ముతూ మరోవైపు రోజుకు 14 గంటల పాటు ప్రిపేర్ అయ్యి ఆరు నెలల్లో ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ద్వారా శివ మహేశ్ ( Shiva Mahesh )వార్తల్లో నిలవడం గమనార్హం.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన శివ మహేశ్ సక్సెస్ స్టోరీపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఉడాన్ సుశీల లక్ష్మణ్ దంపతుల కుమారుడైన శివ మహేశ్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు.ఆ తర్వాత జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదివిన శివ మహేశ్ కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ( Degree from Kakatiya University ), అంబేద్కర్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేయడం గమనార్హం.

కరీంనగర్ లోని జిల్లా గ్రంథాలయం కేంద్రంగా శివ మహేశ్ ప్రిపరేషన్ సాగించారు.మార్చిలో రిలీజ్ చేసిన గురుకుల ఉపాధ్యాయ ఫలితాలలో టీజీటీతో పాటు పీజీటీలో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ ను శివ మహేశ్ సాధించారు.ఈ పరీక్షలతో పాటు టీఎస్పీ పీఎస్పీ జేఎల్ లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ ను సాధించడం గమనార్హం.

Advertisement

జేఎల్ ( హిందీ) లో రాష్ట్ర స్థాయిలో శివ మహేశ్ నాలుగో ర్యాంక్ ను సాధించారు.

శివ మహేశ్ ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని మామిడి గురుకులం విద్యాలయంలో జేఎల్ గా విధులు నిర్వహిస్తున్నారు.టీ అమ్ముతూ 5 రూపాయల భోజనం తిని శివ మహేశ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన సందర్భాలు అయితే ఉన్నాయి.శివ మహేశ్ సక్సెస్ స్టోరీని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

శివ మహేశ్ సక్సెస్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.శివ మహేశ్ లక్ష్యాలను సాధించడం విషయంలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

చిప్స్ ఇష్టంగా తింటున్నారా..అయితే ఇది చదివితీరాల్సిందే....
Advertisement

తాజా వార్తలు