దసరా విలన్ పై మరో నటి ఆరోపణలు.. సెట్ లో అసభ్యంగా ప్రవర్తించారంటూ?

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా దసరా విలన్ షైన్ టామ్ చాకో ( Shine Tom Chacko )పేరు సోషల్ మీడియా వేదికగా మారు మ్రోగుతోంది.

ఇప్పటికే నటి విన్సీ షైన్ టామ్ చాకోపై ఆరోపణలు చేయగా తాజాగా ఆరోపణలు చేసిన జాబితాలో మరో నటి కూడా ఈ నటి నిజ స్వరూపాన్ని బయటపెట్టింది.

మలయాళ నటి అపర్ణా జాన్ ( Malayalam actress Aparna John )ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

విన్సీ చేసిన ఆరోపణలు నూటికి నూరు శాతం నిజమేనని ఆమె పేర్కొంది.షైన్ టామ్ చాకో మూవీ సెట్స్ లో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడని అపర్ణ వెల్లడించింది.సెట్ లో మహిళకు మానసిక క్షోభ కలిగే విధంగా షైన్ టామ్ చాకో తీరు ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.

షైన్ టామ్ చాకో మాట్లాడుతున్న సమయంలో అతని నోటి నుండి తెల్లటి పొడి రాలుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

అది మాదక ద్రవ్యమో కాదో మాత్రం తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు.షైన్ టామ్ చాకో మాటలన్నీ డబుల్ మీనింగ్ తో ఉంటాయని ఆమె అన్నారు.విన్సీ ఆరోపణల అనంతరం షైన్ టామో చాకోను అరెస్ట్ చేయడంతో పాటు బెయిల్ పై రిలీజ్ చేశారు.

విన్సీ పోలీసులకు( Vinci police ) ఫిర్యాదు చేయకపోయినా డ్రగ్స్ ఆరోపణలు రావడంతో షైన్ టామ్ చాకోను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.షైన్ టామ్ చాకో ఇటీవల విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించడం గమనార్హం.

దసరా, దేవర, రంగబలి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో షైన్ టామ్ చాకో నటించి ప్రేక్షకులను మెప్పించడం గమనార్హం.షైన్ టామ్ చాకో రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు