ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెల్చుకుంది.. అయినా రెస్టారెంట్‌లో వర్కింగ్..?

ఒలింపిక్స్‌లో మెడల్స్ గెలిచి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది క్రీడాకారులు రాజభోగాలు అనుభవిస్తారని మనం అనుకుంటాం కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మన అభిప్రాయం తప్పు అనుకోక తప్పదు.

ఈ వీడియోలో ఒక ప్రపంచ స్థాయి క్రీడాకారిణి తన కుటుంబానికి సహాయం చేయడానికి మామూలు మనిషి లాగా కష్టపడుతోంది.

నిజానికి ఆమె పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడలిస్ట్.

ఆమె మరెవరో కాదు చైనీస్ జిమ్నాస్ట్ జౌ యాక్విన్( Chinese Gymnast Zhou Yaqin )! వెండి పతకం గెలిచిన తర్వాత ఇటాలియన్ జిమ్నాస్ట్‌లు అయిన అలీస్ డిఅమాటో, మనీలా ఎస్పోసిటోలు పోడియంపై తమ పతకాలను ‘కొరుకుతున్న’ దృశ్యాన్ని చాలా అందంగా అనుకరించడం ద్వారా ఆమె ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.2024 సమ్మర్ గేమ్స్ ముగిసినప్పటికీ, యాక్విన్‌కు విశ్రాంతి లేకుండా పోయింది.ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, యాక్విన్ తన తల్లిదండ్రులకు చెందిన రెస్టారెంట్‌లో కస్టమర్లకు ఆహారం సర్వ్‌ చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది.

ఒలింపిక్ యూనిఫాంలో ఉన్న యాక్విన్ తన స్వగ్రామమైన హెంగ్‌యాంగ్‌కు వెళ్లి తన ఫ్యామిలీ రెస్టారెంట్‌లో వర్క్ చేస్తున్నట్లు ఓ రిపోర్ట్ తెలిపింది."పారిస్ ఒలింపిక్స్‌( Paris Olympics )లో వెండి పతకం గెలుచుకున్న చైనీస్ జిమ్నాస్ట్ జౌ యాక్విన్ గుర్తుందా? ఒలింపిక్స్ తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది.

Advertisement

కానీ ఇది సాధారణ సెలవు కాదు.ఎందుకంటే ఆమె తన తల్లిదండ్రులు నడిపే రెస్టారెంట్‌లో పని చేయాలి" అని వీడియోకు ఒక క్యాప్షన్ జోడించారు.ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇప్పటికే 2.9 మిలియన్ మంది చూశారు.ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు.

సాధారణంగా మన ఇండియాలో మెడల్ గెలుచుకుంటే పెద్ద ఉద్యోగాలు వస్తాయి.ఇలాంటి కష్టాలు చేయాల్సిన అవసరమే రాదు కానీ చైనా( China )లో మాత్రం అలా కాదు.

అలాగే ఇక్కడ అథ్లెట్లు అంత పెద్ద విజయం సాధించిన చాలా సింపుల్‌గా లైఫ్ లీడ్ చేస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు "ఆమెది చాలా కష్టపడే స్వభావం.

కొంచెం కూడా గర్వం లేకుండా జీవిస్తోంది." అని కామెంట్లు చేశారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఆమె వినయానికి తాను ఫిదా అయినట్లు మరొకరు పేర్కొన్నారు."కష్టపడి పని చేసి కుటుంబానికి డబ్బు సంపాదించడం ఒక గొప్ప పని.ఆమె గర్వించాలి.ఆమె మెడల్ విన్నింగ్ మూమెంట్ ఇంటర్నెట్ ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయింది" అని మరొకరు అన్నారు.

Advertisement

"ఆమె కుటుంబం, సమాజం గర్వించాలి" అని ఒక కామెంట్‌లో ఉంది.

తాజా వార్తలు