Sharwanand : శర్వానంద్ సినిమాకు బాలయ్య హిట్ మూవీ టైటిల్.. బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్( Hero Sharwanand ) గురించి మనందరికీ తెలిసిందే.

శర్వానంద్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు శర్వానంద్.ఇకపోతే ప్రస్తుతం శర్వానంద్ ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నాడు.

ఓ వైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై( UV Creations banner ) అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూనే, మరోవైపు అనీల్ సుంకర నిర్మాతగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమాను పట్టాల పైకి తీసుకొచ్చాడు.

Sharwanand With Balakrishnan Title

ఇప్పుడీ సినిమాకు టైటిల్ దాదాపు లాక్ అయింది.శర్వానంద్, రామ్ అబ్బరాజు సినిమాకు నారీ నారీ నడుమ మురారి ( Nari Nari Naduma Murari )అనే టైటిల్ అనుకుంటున్నారట.దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement
Sharwanand With Balakrishnan Title-Sharwanand : శర్వానంద్ �

తన సినిమాలకు తెలుగు దనం ఉట్టిపడే టైటిల్స్ పెడుతుంటాడు రామ్ అబ్బరాజు.తన గత చిత్రానికి సామజవరగమన అనే టైటిల్ పెట్టాడు.

ఈసారి నారీనారీ నడుమ మురారి అనే టైటిల్ పెట్టే ప్లాన్ లో ఉన్నాడు.టైటిల్ కు తగ్గట్టు ఇందులో ఇద్దరు హీరోయిన్లు.

Sharwanand With Balakrishnan Title

ఒక హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను తీసుకున్నారు.మరో హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్టున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ నడుస్తోంది.

ఏప్రిల్ 10వరకు ఇది కొనసాగుతుంది.మే నెలలో రెండో షెడ్యూల్ ఉంటుంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Advertisement

తాజా వార్తలు