శర్వానంద్ ఒకే ఒక జీవితం ఫస్ట్ డే కలక్షన్స్..!

యువ హీరో శర్వానంద్ లీడ్ రోల్ లో శ్రీ కార్తీక్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఒకే ఒక జీవితం.

ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా అమల అక్కినేని ఇంపార్టెంట్ రోల్ లో నటించారు.

మదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి కూడా నటించారు.శుక్రవారం రిలీజైన ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో 380 సెంటర్స్ లో రిలీజైన ఒకే ఒక జీవితం సినిమా ఫస్ట్ రోజు 1.30 కోట్ల గ్రాస్ రాబట్టింది.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 2.45 కోట్ల గ్రాస్ అంటే 1.30 కోట్ల షేర్ రాబట్టింది.శర్వానంద్ ఇదివరకు సినిమాల కన్నా ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.

ఖచ్చితంగా ఈ మౌత్ టాక్ తో సినిమాకు ఈ రెండు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7.56 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పొందాలంటే ఇంకా ఆరున్నర కోట్ల దాకా కలక్షన్స్ ని రాబట్టాల్సి ఉంటుంది.టాక్ బాగుంది కాబట్టి సినిమా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ కొడుతుందని అంటున్నారు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు