జగన్ అరెస్ట్ కు షర్మిల డిమాండ్ .. వైసీపీ కౌంటర్ ఇదే 

అదానీ(Adan) నుంచి విద్యుత్ కొనుగోళ్లలో జగన్ (Jagan)కు లంచాలు ముట్టాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో,  జగన్ సోదరి , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్ (YS Sharmila, Jagan)అరెస్ట్ చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో షర్మిలకు కౌంటర్ ఇస్తూ ఆదాని వ్యవహారంపై వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనేక విషయాలను వెల్లడిస్తూ వైఎస్ షర్మిలపై తీవ్రంగా మండిపడ్డారు.

ఆదాని నుంచి విద్యుత్ కొనుగోళ్లలో జగన్ కు లంచాలు ముట్టాయని షర్మిల మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని,  అదానీ కంపెనీ విద్యుత్ కేంద్ర ప్రభుత్వానికి అమ్మితే కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి ద్వారా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది .ఇందులో అదానీ లంచాలు ఎందుకు ఇస్తారు ?  ఆదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు.షర్మిల పనుగట్టుకుని జగన్ పై విమర్శలు చేస్తోంది. 

రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవాలి అనుకుంటున్నారు .అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అని చార్జిషీట్ లో ఉంటే,  జగన్ కు 1750 కోట్లు లంచం ఇచ్చారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.  జగన్ హయాంలో రాష్ట్రానికి తక్కువలో విద్యుత్తు కొని ఆదా చేస్తే , తప్పుడు ప్రచారాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.

చంద్రబాబుకు , షర్మిలకు (Chandrababu, Sharmilaa)దమ్ముంటే నరేంద్ర మోదిని(Narendra Modi) ప్రశ్నించాలి.గడిచిన ఆరు నెలలలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోంది అంటూ శివప్రసాద్ రెడ్డి (Sivaprasad Reddy)విమర్శలు చేశారు.

Advertisement

ఏపీ ప్రజలను గాలికి వదిలేసి అబద్ధలను ఆస్త్రాలుగా చేసుకున్నారని మండిపడ్డారు.అప్పటి క్యాబినెట్ చర్చల తరువాత 2.49 పైసలకే విద్యుత్తు కొనుగోలు చేసింది కానీ , ఇప్పుడు రామోజీరావు కొడుకు,  రాధాకృష్ణలు,  షర్మిల , టిడిపి నేతలు పక్కనే ఉండి చూసినట్లు మాట్లాడుతున్నారు.చంద్రబాబు గతంలో ఇదే సెకి ద్వారా 5.30 పైసలతో విద్యుత్ కొనుగోలు చేశారు అంటూ శివప్రసాద్ రెడ్డి(Sivaprasad Reddy) అన్నారు.అమెరికాలో జగన్ పేరుందని దుష్ప్రచారం చేస్తున్నారు .అక్కడ వేసిన చార్జిషీట్ లో ఎక్కడా జగన్ పేరు లేదు.ఏ ప్రభుత్వం పేరు లేదు అని శివప్రసాద్ రెడ్డి అన్నారు.

  ప్రతిపక్షాన్ని పూర్తిగా మట్టు పెట్టాలని ప్రశ్నించే గొంతుకను నొక్కేందుకు వీళ్ళు చట్టాలు తెస్తున్నారు.  ప్రజల సమస్యలను మేము మాట్లాడుతున్నామని నల్ల చట్టాలు తీసుకొస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు